Litchi for Diabetes: షుగర్‌ పేషెంట్లు లీచీ పండ్లు తింటే ఏం జరుగుతుందో తెలుసా..?

|

Jun 14, 2024 | 12:53 PM

వేసవి అంటే రకరకాల పండ్ల సీజన్. పుచ్చకాయలు, మామిడిపళ్లు, పనసపండ్లు, ఖర్జూరం వంటి ఎన్నో రకాల పండ్లు మార్కెట్‌లో దర్శనమిస్తాయి. ఈ పండ్లన్నీ సాధారణంగా అందరూ ఎంతో ఇష్టపడి తింటారు. వేసవి పండ్లలో లిచ్చి కూడా ఒకటి. ఇది జ్యుసిగా, తినడానికి రుచిగా ఉంటుంది. అందుకే పిల్లలకు ఈ పండు అంటే చాలా ఇష్టం. స్వీట్స్‌ తినడానికి వీలులేని వృద్ధులు కూడా లిచ్చి పండ్లను ఆరగిస్తారు..

1 / 5
వేసవి అంటే రకరకాల పండ్ల సీజన్. పుచ్చకాయలు, మామిడిపళ్లు, పనసపండ్లు, ఖర్జూరం వంటి ఎన్నో రకాల పండ్లు మార్కెట్‌లో దర్శనమిస్తాయి. ఈ పండ్లన్నీ సాధారణంగా అందరూ ఎంతో ఇష్టపడి తింటారు. వేసవి పండ్లలో లిచ్చి కూడా ఒకటి. ఇది జ్యుసిగా, తినడానికి రుచిగా ఉంటుంది. అందుకే పిల్లలకు ఈ పండు అంటే చాలా ఇష్టం. స్వీట్స్‌ తినడానికి వీలులేని వృద్ధులు కూడా లిచ్చి పండ్లను ఆరగిస్తారు.

2 / 5
లీచీలో పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్ బి కాంప్లెక్స్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, ఐరన్ వంటి అనేక మినరల్స్‌  ఉంటాయి. కాబట్టి దీన్ని తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.

3 / 5
లిచీ జ్యుసీగా ఉండే తీపి పండు. అందుకే లిట్చీ రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుందేమోనని చాలా మంది డయాబెటిక్ రోగులు లిచీ తినాలా.. వద్దా.. అనే ప్రశ్న సందిగ్దంలో ఉంటారు. లిచీలో ఫైటోకెమికల్స్, బయోయాక్టివ్‌లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. అయితే డయాబెటిక్ రోగులు మాత్రం పరిమిత మొత్తంలో మాత్రమే తినాలి. ఫలితంగా లిచీ తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు.

4 / 5
మధుమేహ వ్యాధిగ్రస్తులు లిచీని పరిమిత పరిమాణంలో తీసుకోవాలి. అయితే షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉంటే డాక్టర్ సలహాతో మాత్రమే లిచీ తీసుకోవాలి. చైనీస్ సంస్కృతిలో లిచీని వెచ్చని పండు అంటారు. కాబట్టి లిచీని ఎక్కువగా తినడం వల్ల వేడి చేసి.. గొంతు నొప్పి, ముక్కు నుంచి రక్తం కారడం వంటి సమస్యలు తలెత్తుతాయి.

5 / 5
అధిక శరీర బరువు గురించి ఆందోళన చెందేవారు లిచీని మితంగా తినడం మంచిది. లిచీ తినడం వల్ల శరీరంలో కేలరీలు పెరుగుతాయి. కాబట్టి లీచీని ఎక్కువగా తినకూడదు.