నిమ్మరసంతో బాడీ నిజంగా క్లీన్ అవుతుందా.. ప్రచారాలు కాదు వాస్తవాలు తెలుసుకోండి..

Updated on: Mar 03, 2026 | 1:38 PM

Lemon Water: ఆరోగ్యానికి నిమ్మకాయ ఎంతో మేలు చేస్తుందన్నది జగమెరిగిన సత్యం. ముఖ్యంగా విటమిన్ సి పుష్కలంగా ఉండే నిమ్మరసం తాగడం వల్ల శరీరం డిటాక్స్ అవుతుందని సోషల్ మీడియాలో భారీగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇది ఎంతవరకు నిజం? నిమ్మరసం నిజంగా మలినాలను క్లీన్ చేస్తుందా? దీనిపై ఢిల్లీకి చెందిన ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ చంచల్ శర్మ కీలక విషయాలను వెల్లడించారు.

1 / 5
మన శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించడానికి ప్రకృతి సిద్ధంగానే ఒక వ్యవస్థ ఉంది. కాలేయం, మూత్రపిండాలు, జీర్ణవ్యవస్థ నిరంతరం మలినాలను బయటకు పంపిస్తూనే ఉంటాయి. నిమ్మరసం ఈ ప్రక్రియకు కొంతవరకు సహకరిస్తుందే తప్ప ఇది ఒక్కటే శరీరాన్ని పూర్తిగా నిర్విషీకరణ చేస్తుందనుకోవడం సరైనది కాదని డాక్టర్ చంచల్ వివరించారు.

2 / 5
జీర్ణశక్తి మెరుగుదల: నిమ్మకాయలోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు జీర్ణ ఎంజైమ్‌లను చురుకుగా ఉంచుతాయి. దీనివల్ల జీర్ణక్రియ సాఫీగా సాగి, మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

3 / 5
లివర్ పనితీరుకు మద్దతు: నిమ్మరసం నేరుగా లివర్‌ను శుభ్రం చేయకపోయినా జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా పరోక్షంగా విషతుల్యాలను బయటకు పంపడంలో లివర్‌కు సహాయపడుతుంది. నిమ్మరసం మెటబాలిజంను పెంచుతుంది. ఇది క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఫలితాలు కనిపిస్తాయి.

4 / 5
జాగ్రత్తలు తప్పవు: నిమ్మరసం ఆరోగ్యకరమే అయినా అందరికీ ఒకేలా పని చేయదు. వాడేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతిరోజూ కాకుండా వారానికి 4 నుంచి 5 రోజులు తాగితే సరిపోతుంది. గ్యాస్, ఎసిడిటీ లేదా దంత సమస్యలు ఉన్నవారు ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగకూడదు. ఇది కడుపులో చికాకును కలిగిస్తుంది.

5 / 5
నిమ్మరసంలో అదనంగా చక్కెర లేదా ఉప్పు కలపకుండా తాగడమే అత్యుత్తమం. ఏదైనా ఔషధం లేదా డ్రింక్ మీ శరీర తత్వానికి సరిపడుతుందో లేదో గమనించుకుని తీసుకోవడం ఉత్తమం. నిమ్మరసం ఒక సహాయకారి మాత్రమే కానీ అదే పూర్తి చికిత్స కాదు.

Loading...
Unable to load recommendations.
Follow Us