
కొరియన్లు ఎక్కడా ఉన్నా వారిని ఈజీగా గుర్తుపట్టొచ్చు ఎందుకంటే వాళ్ళు చూడటానికి చాలా అందంగా కనిపిస్తారు. అమ్మాయిలు, అబ్బాయిలు చూడటానికి అందం అనే మచ్చ వేసుకుని పుట్టినట్టు ఉంటారు. వారు అలా బ్యూటీగా ఉండటానికి కారణం ఉంది. అదేంటో ఇక్కడ వివరంగా చదివి స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం..

కొరియన్లు బహు సుందరంగా ఉండటానికి కారణం బియ్యపు నీరు. అవును మీరు వింటున్నది నిజమే. వీటిలో విటమిన్లు, అమైనో ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి ఇదే కె-బ్యూటీ రహస్యం. ఈ రైస్ వాటర్ చర్మాన్ని గాజులా మెరిసేలా చేస్తుంది ఇంకా ఇది జుట్టును బలోపేతం చేస్తుంది.

బియ్యం నీటిని ఎలా తయారు చేయాలంటే? ముందుగా మీరు ఒక కప్పు తెల్ల బియ్యాన్ని తీసుకుని వాటిని బాగా కడిగి మొదటి రెండు సార్లు నీటిని వంపేయండి ఆ తరువాత దీనిలో 3 కప్పుల ఫిల్టర్ నీళ్ళను పోసి కలపండి . ఇలా 30 నిమిషాల పాటు ఉంచి వీటిని నానబెట్టుకోవాలి, ఆ తర్వాత దీనిని ఒక గ్లాస్ పాత్రలోకి తీసుకోండి

దీనిని ఇలా ఉడకబెట్టండి: ఒక కప్పు బియ్యాన్ని నీటితో దీనిని బాగా ఉడికించాలి, ఈ బియ్యం మంచిగా ఉడికిన తర్వాత దానిలో ఉండే పిండిపదార్థం నీటిని వేరు చేసి దీనిని పూర్తిగా చల్లారనిచ్చిన తరువాత వేరుగా పెట్టుకోవాలి. ఈ వడకట్టిన బియ్యం నీటిని 24 గంటల పాటు గది ఉష్ణోగ్రత వద్ద పులియబెట్టి, ఫ్రిజ్ లో స్టోర్ చేయండి.

ఇప్పుడు మంచి దూదిను తీసుకుని చల్లటి బియ్యపు నీటిలో నానబెట్టి, ముఖం శుభ్రం చేసుకుని వీటిని సున్నితంగా తుడవండి. ఈ మిశ్రమాన్ని కొద్దిగా కలబంద జెల్‌తో కలిపి ఐస్ లో పోసి తీసుకుంటే మంచిది. మీరు ఈ క్యూబ్స్‌ను ఉదయం, రాత్రి మీ ముఖంపై రుద్దితే మీ ముఖం గాజులా మెరిసిపోతుంది