Rajula Chicken Biryani: గోదావరి జిల్లాల రాయల్ రుచి.. నోట్లో వేస్తే కరిగిపోయే కోనసీమ రాజుల చికెన్ బిర్యానీ!

Updated on: Jul 13, 2026 | 9:30 PM

 బిర్యానీ అంటే చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ఉండే మజానే వేరు. అయితే ఎప్పుడూ తినే రెగ్యులర్ దమ్ బిర్యానీలు, పలావ్‌లు కాకుండా ఒక స్పెషల్ రాయల్ టేస్ట్‌ను ఆస్వాదించాలనుకుంటే గోదావరి జిల్లాల స్పెషల్ 'కోనసీమ రాజుల కోడి పలావ్' (రాజుల చికెన్ బిర్యానీ) ఒక అద్భుతమైన ఎంపిక అని చెప్పవచ్చు.

1 / 5
ఈ బిర్యానీ ప్రత్యేకత ఏంటంటే, బియ్యాన్ని వండక ముందే దానికి ఉప్పు, కారం, నూరిన ప్రత్యేక మసాలాలు పట్టిస్తారు. ఎటువంటి ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్స్ కానీ, కెమికల్ ఎసెన్స్ లు కానీ వాడకుండా పక్కా పల్లెటూరి నాచురల్ పద్ధతిలో వండే ఈ బిర్యానీ నోట్లో వేస్తే అలా కరిగిపోతుంది.  ఈ రాయల్ చికెన్ బిర్యానీని ఇంట్లోనే పక్కా కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

2 / 5
ఈ అద్భుతమైన బిర్యానీ తయారీ కోసం ముందుగా ఒక కేజీ చికెన్ ను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇందులో తగినంత ఉప్పు, కారం, పసుపు వేసి ముక్కలకి బాగా పట్టించి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. అరగంట తర్వాత ఇందులో ఒక చుక్క కూడా నీళ్లు పోయకుండా, చికెన్ లో వచ్చే నాచురల్ వాటర్ తోనే స్టవ్ మీద పెట్టి డెబ్బై శాతం వరకు ఉడికించుకోవాలి. ఇలా చేయడం వల్ల చికెన్ లోపల వరకు ఉప్పు కారం పట్టి ముక్క భలే జ్యూసీగా ఉంటుంది.

3 / 5
మరోవైపు స్టవ్ మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసుల చొప్పున నీటిని పోసి, అందులో లవంగాలు, ధనియాలు, జీలకర్ర, దాల్చినచెక్క, బిర్యానీ ఆకు, పువ్వు వంటి స్పైసెస్ అన్నింటినీ వేసి నీటిని బాగా మరిగించాలి . దినుసుల ఫ్లేవర్ అంతా నీటిలోకి దిగాక ఆ వాటర్ ను వడకట్టుకుని పక్కన పెట్టుకోవాలి.ఇక మన రాజుల బిర్యానీకి వాడే బియ్యం విషయానికి వస్తే ఈ బిర్యానీకి పక్కగా మన సోనా మసూరి సన్న బియ్యంతోనే ఎక్కువ చేస్తామండి.

4 / 5
బియ్యాన్ని కడిగి చుక్క నీరు లేకుండా పూర్తిగా ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ధనియాలు, జీలకర్ర, దాల్చినచెక్క, లవంగాలు, అల్లం వెల్లుల్లి కలిపి మెత్తగా నూరుకున్న మసాలా ముద్దను, తగినంత ఉప్పు, కారం, పసుపును ఆరిన బియ్యానికి వేసి ప్రతి గింజకూ పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బిర్యానీ గిన్నె పెట్టుకుని నాలుగు చెంచాల నూనె లేదా నెయ్యి వేడి చేయాలి. నూనె కాగగానే ఈ బిర్యానీకి అసలైన సీక్రెట్ మరియు రాయల్ సువాసనను ఇచ్చే అర జాజికాయ పొడిని వేసుకోవాలి. ఆ వెంటనే కొన్ని వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి మగ్గనివ్వాలి. ఇందులో ఉల్లిపాయ ముక్కలు కోయకుండా, ఉల్లిపాయలను ఫలంగా వేసుకోవడం ఈ బిర్యానీలోని మరో ప్రత్యేకత.

5 / 5
ఆ తర్వాత టమాటా ముక్కలు, పుదీనా, కొత్తిమీర వేసి ఫ్రై చేసి, ముందుగా ఉడికించిన చికెన్ ముక్కలను వేసి నూనెలో వేయించాలి. ఇలా వేయించడం వల్ల ముక్క చుట్టూ కోటింగ్ ఏర్పడి బిర్యానీ ఉడికినా ముక్కలు విడిపోవు. ఇప్పుడు మసాలా పట్టి ఉంచిన బియ్యాన్ని వేసి ఐదు నిమిషాలు ఫ్రై చేయాలి. ఆపై ముందుగా మరిగించి వడకట్టుకున్న దినుసుల ఎసరు నీటిని పోసి హై ఫ్లేమ్ లో ఉడికించాలి. నీరంతా దగ్గర పడుతున్నప్పుడు పైన కొద్దిగా హోమ్‌మేడ్ బిర్యానీ మసాలా పొడి, నెయ్యి చల్లి, లో ఫ్లేమ్ లో పది నిమిషాలు దమ్ చేసుకోవాలి. అంతే గుమగుమలాడే కోనసీమ రాజుల చికెన్ బిర్యానీ సిద్ధం. వేడి ముక్కతో పాటు ఆ ఉల్లిపాయ నంచుకుని తింటుంటే స్వర్గం కనిపిస్తుంది. 

Follow Us