శరీరానికి ఎన్నో పోషకాలను అందించే అద్భుతమైన కూరగాయ..నెలకొసారైనా ఖచ్చితంగా తినాల్సిందేనట!

Updated on: Oct 10, 2026 | 7:25 AM

మన కూరగాయల మార్కెట్లో తరచూ కనిపించే ఆరోగ్యకరమైన కూరగాయలలో కోల్‌రాబీ ఒకటి. తెలుగులో దీనిని పిండీ దుంప అని కూడా పిలుస్తారు. క్యాబేజీ, క్యాలీఫ్లవర్ కుటుంబానికి చెందిన ఈ కూరగాయ రుచిలోనే కాకుండా పోషకాల విషయంలోనూ ఎంతో ప్రత్యేకమైనది. దీనిని తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మన శరీరానికి కలిగే ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 6
క్యాబేజీ కుటుంబానికి చెందిన కోర్‌రాబీ పుష్కలమైన పోషకాలు నిండిన కూరగాయ. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు చేకూరుతాయి. ఇందులో విటమిన్ సీ, ఫైబర్, పొటాషియం, విటమిన్ బి6 పుష్కలంగా ఉంటాయి. నూల్‌కోల్‌లోని అధిక పీచుపదార్థం జీర్ణక్రియను మెరుగుపరచి, మలబద్ధకం సమస్యను నివారిస్తుంది.

2 / 6
జీర్ణ వ్యవస్థకు ఎంతో మేలు- కోల్‌రాబీ ఆహార పీచుపదార్థం సమృద్ధిగా ఉంటుంది. ఇది ప్రేగుల కదలికలను సులభతరం చేసి జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. క్రమం తప్పకుండా దీనిని తీసుకోవడం వల్ల మలబద్ధకం, కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి జీర్ణసంబంధిత సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.

3 / 6
రోగనిరోధక శక్తి పెరుగుదల- కోల్‌రాబీలో విటమిన్ సీ అధిక పరిమాణంలో ఉంటుంది. రోజువారీ విటమిన్ సీ అవసరాలలో దాదాపు 100శాతం కోల్‌రాబీ ద్వారా లభిస్తుంది. ఇది తెల్ల రక్తకణాల ఉత్పత్తిని పెంచి, ఇన్ఫెక్షన్లు, సీజనల్ వ్యాధుల నుండి శరీరాన్ని రక్షిస్తుంది.

4 / 6
గుండె ఆరోగ్యం, రక్తపోటు నియంత్రణ- ఈ కూరగాయలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తనాళాల ఒత్తిడిని తగ్గించి, అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది. అలాగే, ఇందులోని యాంటీఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె సంబంధిత జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

5 / 6
బరువు తగ్గడానికి ఉత్తమ ఎంపిక- కోల్‌రాబీ కేలోరీలు చాలా తక్కువగా ఉంటాయి. నీటి శాతం, పీచు పదార్థం ఎక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు తమ డైట్‌లో దీనిని చేర్చుకోవడం ద్వారా ఎక్కువ సేపు కడుపు నిండిన అనుభూతిని పొందుతారు. ఇది అతిగా తినే అలవాటును నివారిస్తుంది.

6 / 6
కంటి చూపు మెరుగుపడుతుంది- కోల్‌రాబీలో ఉండే కెరోటినాయిడ్లు కంటి ఆరోగ్యానికి ఎంతో సహాయపడతాయి. ఇది వయస్సు పెరగడం వల్ల వచ్చే కంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఆరోగ్య ప్రయోజనాల కోసం ఈ కూరగాయను పచ్చిగా సలాడ్లలో లేదా కూరగా, సాంబార్‌లో వేసుకుని తినవచ్చు. దీని లేత ఆకులను కూడా ఆకుకూరలా వండుకుని తినవచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం కోల్‌రాబీని మీ రోజువారీ ఆహారంలో తప్పక భాగం చేసుకోండి.

Loading...
Unable to load recommendations.
Follow Us