
గుండె పనితీరు, దాని ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి పోషకాహారం తీసుకోవడం ఎంతో అవసరం. ముఖ్యంగా గుండెకు కావలసిన పోటాషియం మన ఆహారంలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాక పొటాషియం లోపం ఏర్పడకుండా కూడా చూసుకోవాలి.

పొటాషియం శరీరానికి, గుండెకు చాలా అవసరం. దీని లోపం లేదా అధికం అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. గుండె మెరుగ్గా పనిచేయడానికి కూడా విటమిన్ కే, పొటాషియం లోపాన్ని పోగొట్టే ఆహారాలు, పొటాషియం శరీరానికి చాలా అవసరం.

పొటాషియం లోపం అనేక సమస్యలను కలిగిస్తుంది. ఇది హృదయ స్పందన రేటును ప్రభావితం చేస్తుంది.

పొటాషియం శరీర ద్రవాలు, కండరాలు, నరాల పనితీరును నియంత్రించడంలో సహాయపడే ముఖ్యమైన మినరల్. పొటాషియం లోపం రక్తపోటును, హృదయ స్పందన రేటును ప్రభావితం చేస్తుంది

పొటాషియం లోపం, అధిక పొటాషియం రెండూ ప్రమాదకరం. సమయానికి చికిత్స చేయకపోతే, గుండె పంపింగ్ ఆగిపోతుంది. ఇది చాలా ప్రమాదకరమైన స్థితి.

చిలగడదుంపలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇందులో ప్రొటీన్, ఫైబర్ కూడా బాగానే ఉంటాయి.

అరటిపండ్లు కూడా పొటాషియం మినరల్‌కు ఉత్తమ మూలం. రోజులో 2,3 అరటిపండ్లు తినడం ద్వారా రోజువారీ పొటాషియం అవసరాలను తీర్చవచ్చు.