Thati Neera: ఛోడ్‌ చింత.. మార్‌ ముంత.. మత్తు ఉండదు.. కిక్‌ ఎక్కదు.. నీరా దివ్యౌషధం..

|

May 03, 2023 | 4:55 PM

ప్రకృతికి దగ్గరగా ఆహ్లాదమైన పంట పొలాల మధ్య చెట్టు నుంచి వచ్చే కల్లును అన్ని వయసుల వారు ఇష్టపడతారు. అలాంటి కల్లుతో పాటు.. తాటి చెట్ల నుంచి వచ్చేదాన్ని నీరా అని అంటారు. నీరాలో ఎన్నో ఆరోగ్య పోషకాలు ఉండటంతో.. వయసుతో సంబంధం లేకుండా దీన్ని తీసుకునేందుకు ఇష్టపడతారు. కానీ, ఇది వేకువజామునే లభిస్తుంది. నీరా కావాలంటే ఒకరోజు ముందే ప్రణాళిక అవసరం. నీరా ఎలా తీస్తారు.. నీరాతో ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 8
ఛోడ్‌ చింత...మార్‌ ముంత. తాగినోడికి తాగినంత ఆనందం ఆరోగ్యం. మత్తు ఉండదు. కిక్‌ ఎక్కదు. ఒళ్లంతా జల్లుమనిపించే ఒరిజినల్‌ హెల్తీ డ్రింక్‌ ఇది. ఆల్కహాల్‌ కంటెంట్‌ అస్సలు ఉండని అచ్చమైన, స్వచ్ఛమైన కల్లునే నీరా అంటారు.

2 / 8
తాటి చెట్టు నుంచి వచ్చేదే 'నీరా'. వేసవిలో 40 రోజుల పాటు ఉదయాన్నే తాటి చెట్టు నుంచి తీస్తారు. తాటి చెట్ల నుంచి నీరాను సేకరించడం డిసెంబర్‌ నెల నుంచి మొదలు పెడుతారు. తాటి నీరా అత్యంత ఆరోగ్యదాయకమైన ప్రకృతిసిద్ధమైన పానీయం అని చెప్పవచ్చు.

3 / 8
తాటిచెట్టు గెలల నుంచి స్రవించే పోషక ద్రవాన్ని పులియ ముందే సేకరిస్తే నీరా అంటారు. అదే పులియబెట్టి సేకరిస్తే కల్లు అవుతాయి. సూర్యోదయం కంటే ముందే తాటిచెట్టు నుంచి సేకరిస్తే నీరా.. అదే సూర్యోదయం తర్వాత వచ్చేదే తాటి కల్లు.

4 / 8
తాజా నీరా చక్కటి రుచితో అంతకుమించిన పోషకాలతో కూడి ఉంటుంది. దీన్ని హెల్త్‌ డ్రింక్‌గా తాగవచ్చు. కొబ్బరి నీటిలా తాజాగా ఉంటుంది. కొబ్బరి బోండంలోని నీటి కంటే కొంత తీయగా ఉంటుంది.

5 / 8
ప్రతిరోజూ సూర్యాస్తమయం తర్వాత కొత్త కుండను తినే సున్నపుతేటతో శుభ్రంగా కడిగి అది ఆరిన తర్వాత కొంత సున్నపుతేటను కుండలో వేసి సాయంత్రం సమయంలో చెట్టుకు అమర్చుతారు. సూర్యోదయం కన్నా ముందే కుండను దింపి వెంటనే అతి తక్కువ ఉష్ణోగ్రతలో నిల్వ ఉంచుతారు. సూర్యోదయం తర్వాత తీసినా, ఎండ, గాలి ఎక్కువగా తగిలినా తొందరగా పులిసిపోతుంది.

6 / 8
దీనిని కల్లుగా గుర్తించరు. ఇందులో మత్తు ఉండదు కనుక నిషా వచ్చే అవకాశాలులేవు. అయితే తాటిచెట్ల నుంచి నేరుగా సేకరించిన నీరాను ఎక్కువ రోజులు నిల్వచేసే అవకాశాలు లేకపోవడంతో శాస్త్రీయ పద్దతిలో నీరాను నిల్వచేయడానికి తెలంగాణ నీరా తాటి ఉత్పత్తుల అభివృద్ధి సంస్థ గత రెండున్నర సంవత్సరాలుగా అనేక వ్యయప్రయాసాలకోర్చి పలు ప్రయోగాలు చేసి విజయం సాధించింది.

7 / 8
నీరా తియ్యగా ఉండటమే కాకుండా సుక్రోజు వంటి పిండి పదార్థాలు ఎక్కువగా కలిగి ఉంటుంది. నీరాలో ఇంకా అనేక రకాల పోషక విలువలు ఉన్నాయి. దీనిలో చక్కెరతోపాటు ఐరన్, ఫాస్ఫరస్‌ వంటి మినరల్స్, ఆస్కార్బిక్‌ ఆమ్లాలు వంటి విటమిన్లు ఉన్నాయి. నీరా జీర్ణశక్తిని పెంచుతుంది. కామెర్లు వంటి జబ్బులు రాకుండా నిరోధిస్తుంది

8 / 8
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో దాదాపు 4 కోట్ల తాటిచెట్లు ఉన్నాయి. ముదురు చెట్ల నుంచి డిసెంబర్‌ నుంచి 4 నెలల పాటు నీరాను సేకరించవచ్చు.