పండు ఒక్కటే.. బెనిఫిట్స్ మాత్రం బోలెడు.. రోజూ ఒక్కటి తింటే.. హాస్పిటల్‌కు వెళ్లే పనేలేదు!

Updated on: Jun 02, 2026 | 1:59 PM

ఈ మధ్య కాలంలో చాలా మంది ఆరోగ్యంపై శ్రద్ధ పెడుతున్నారు. అందుకే ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి జిమ్‌కు వెళ్లడం, డైట్‌లు ఫాలో అవ్వడం చేస్తున్నారు. అయితే డైట్‌లో చాలా మంది ఫ్రూట్స్‌ యాడ్ చేసుకుంటున్నారు. వాటిలో కీవి కూడా ఒకటి. ఇది చూడటానికి చిన్నగా ఉన్నప్పటికీ, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో లేదా బ్రేక్‌ఫాస్ట్‌లో కేవలం ఒక కీవి పండు తిన్నా.. శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు లభిస్తాయి. కాబట్టి రోజూ ఉదయం ఒక కీవి పండు తినడం వల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం.

1 / 5
రోగనిరోధక శక్తిని: వర్షా కాలం రాబోతుంది. ఈ సీజన్‌లో చాలా మందిలో రోగనిరోదశ శక్తి తగ్గుతుంది. కాబట్టి  కీవి బాడీలో హిమ్యూనిటీని పెంచడంలో చాలా బాగా పనిచేస్తుంది. ఇందులో మనకు కావాల్సిన విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. ప్రతిరోజూ ఉదయం కీవి తినడం వల్ల సీజనల్ వ్యాధులు, ఇన్‌ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం తగ్గుతుంది..

2 / 5
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: జీర్ణ క్రియను మెరుగుపర్చడంలో కూడా కీవి పండు అద్భుతంగా పనిచేస్తుంది. కీవిలో 'ఆక్టినిడిన్' అనే ఎంజైమ్ ఉంటుంది, ఇది ప్రోటీన్లను సులభంగా జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. దీనివల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్తి వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.

3 / 5
చర్మ సౌందర్యానికి మేలు చేస్తుంది: చర్మ సౌందర్యాన్ని, పెంచడం, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కూడా ఈ పండు చాలా బాగా పని చేస్తుంది. విటమిన్ సి, విటమిన్ ఇ పుష్కలంగా ఉండే కీవి చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి, చర్మంపై ఉన్న ముడతలు, నల్లటి మచ్చలను తగ్గించడంలో తోడ్పడుతుంది.

4 / 5
బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ : రక్తపోటుతో బాధపడే వారికి ఈ పండు ఒ వరం లాంటిది అనే చెప్పాలి. ఎందుకంటే కీవిలో ఉండే పొటాషియం శరీరంలో సోడియం ప్రభావాన్ని సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది. దీనివల్ల బ్లడ్ ప్రెషర్ కంట్రోల్‌లో ఉండటమే కాకుండా గుండె ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. అలాగే  ఈ పండులో క్యాలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కీవి తినడం వల్ల కడుపు నిండినట్లు అనిపించి, పదే పదే ఆకలి వేయదు. ఇది బరువును అదుపులో ఉంచుకోవడానికి సహాయపడుతుంది.

5 / 5
కంటి ఆరోగ్యం, బాడీ డీటాక్స్: కీవి కళ్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇందులో లూటిన్, జియాక్సంతిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కళ్లకు నష్టం జరగకుండా కాపాడి, చూపును మెరుగుపరచడంలో సహాయపడతాయి. అలాగే శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడానికి కీవి చాలా బాగా సహాయపడుతుంది. ఇందులో నీటి శాతం, ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకు పోయి, ప్రేగుల ఆరోగ్యం మెరుగవుతుంది. కాబటి పూర్తి ఆరోగ్యం కోసం రోజూ ఒక కీవి పండును తినాల్సి వైద్యులు సిఫార్స్ చేస్తారు.

Follow Us