మధుమేహం నియంత్రణలో ఉండాలంటే మీ టిఫిన్లో ఇది ఉండాల్సిందే!

Updated on: Sep 16, 2026 | 8:23 PM

ప్రతి సాయంత్రం టైం లో కానీ రాత్రి భోజనానికి కొత్తగా, ఆరోగ్యకరమైన రెసిపీ కోసం చూస్తున్నారా? అయితే జొన్న మెంతి పరాటా మీకు సరైన ఎంపిక. ఇది కేవలం రుచికరమైనదే కాదు, పోషకాలతో నిండి, ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి లేదా ఆరోగ్యకరమైన జీవనశైలిని కోరుకునే వారికి చాలా ప్రయోజనకరం.

1 / 5
ముందుగా ఒక వెడల్పాటి గిన్నెలో జొన్నపిండిని తీసుకోండి. దీనికి తరిగిన ఉల్లిపాయ ముక్కలు, తురిమిన కీరా, తురిమిన క్యారెట్, సన్నగా తరిగిన మెంతికూరను కలపండి. మెంతికూర దొరకకపొతే పాలకూరను కూడా ఉపయోగించవచ్చు. ఇప్పుడు, దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం మిశ్రమాన్ని వేయండి. ఒక చిటికెడు పసుపు, పావు టీస్పూన్ వాము వేయండి. వామును చేతిలో వేసి నలిపి వేయడం వల్ల సువాసన మరింత పెరుగుతుంది.

2 / 5
వాము వాసన నచ్చకపోతే జీలకర్రను కూడా వాడవచ్చు. చివరగా, రుచికి సరిపడా ఉప్పును వేసి, ఈ పదార్థాలన్నింటినీ నీళ్లు కలపకుండా బాగా కలపండి. కూరగాయలలోని తడి, ముఖ్యంగా కీరా, ఉప్పు కలపగానే నీటిని విడుదల చేస్తాయి. ఈ మిశ్రమానికి కొద్ది కొద్దిగా గోరువెచ్చని లేదా వేడి నీటిని పోసుకుంటూ మెత్తగా కలుపుకోవాలి.

3 / 5

జొన్న పిండికి వేడి నీళ్లు అవసరమని గుర్తుంచుకోండి. పిండి చపాతీ పిండిలా గట్టిగా కాకుండా, కొద్దిగా మెత్తగా ఉండేలా చూసుకోండి. అవసరమైతే కొద్దిగా పిండి లేదా నీళ్లు కలుపుకోవచ్చు. నూనె లేదా నెయ్యి ఈ పిండిలో కలపాల్సిన అవసరం లేదు. ఒక కాటన్ వస్త్రాన్ని తీసుకుని, నీటితో తడిపి గట్టిగా పిండండి. ఈ తడి వస్త్రంపై పిండి ముద్దను ఉంచి, చేతిని కొద్దిగా తడి చేసుకుని వత్తడం ప్రారంభించండి.

4 / 5
చపాతీ కర్ర అవసరం లేకుండా, గుండ్రంగా, వీలైనంత పల్చగా వత్తుకోవచ్చు. పెనంను వేడి చేసి, కొద్దిగా నూనెతో గ్రీస్ చేయండి. వత్తుకున్న పరాటాను వస్త్రంతో సహా పెనంపై వేయండి. నిదానంగా వస్త్రాన్ని తొలగించండి. ఇప్పుడు, పరాటా పైన కొద్దిగా నీటిని చిలకరించి, సగం టీస్పూన్ నూనె లేదా నెయ్యి వేసి కాల్చండి.

5 / 5
Jonna Parotta 4

Jonna Parotta 4

Loading...
Unable to load recommendations.
Follow Us