
జొన్నలతో చేసే ఈ వంటకం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. దీనిని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఇష్టంగా తింటారు అయితే, ఇప్పటి కంటే పాతరోజుల్లో పూర్వీకులు, తాత ముత్తాతల బలానికి కారణమైన ఈ ఫుడ్ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. ఇంకా రైతులు కూడా పొలాలకు వెళ్ళేటప్పుడు దీనినే తినేవాళ్లు.

జొన్న ఘాట్కాకు కావలసిన పదార్థాలు: ఒక కప్పు జొన్న పిండి , మూడు కప్పుల నీరు, ఇంకా రుచికి సరిపడినంత ఉప్పు, ఒక గ్లాస్ మజ్జిగ , ఇంకా ఒక ఉల్లిపాయ , రెండు పచ్చిమిర్చి , కొద్దిగా కొత్తిమీరను తీసుకోవాలి. ఇది కొద్దిగా తిని రోజంతా ఉత్సాహంగా ఉండేవాళ్లు. ఇంకా జొన్నలు కూడా ఆరోగ్యానికి ఎంతో బలం.

జొన్న ఘాట్కా తయారీ విధానం: ఒక గిన్నెలో కొద్దిగా జొన్న పిండిని తీసుకుని దానిలో అర కప్పు నీళ్ళు పోసి దానిని అసలు ఉండలు లేకుండా చేసుకోవాలి ఇప్పుడు మందంగా ఉండే గిన్నెలో కొద్దిగా నీరు పోసి దానిలో కొద్దిగా ఉప్పు కూడా వేసి బాగా మరిగించాలి. ఆ తరవాత ముందుగా కలిపి పెట్టుకున్న జొన్న పిండిని పోస్తూ బాగా తిప్పుకోవాలి.

జొన్న ఘాట్కా తయారీ విధానం స్టెప్ -2 : మీడియం మంట మీదే ఉంచి కనీసం 15 నిమిషాల పాటు దీనిని మిక్స్ అయ్యే కలుపుతూనే ఉండాలి ఇంకా అలాగే బాగా ఉడికించాలి. ఈ మిశ్రమం చిక్కగా అయ్యాక అడుగున అంటుకోకుండా ఉంటె ఘాట్కా రెడీ అయినట్టే. స్టవ్ ఆఫ్ చేసి కిందకు దించి చల్లారిన తర్వాత వడ్డించుకుని తినడమే.

ఈ జొన్న ఘాట్కాను మజ్జిగ, పచ్చిమిర్చితో కానీ తింటే రుచి అదిరిపోతోంది. మీరు కూడా ట్రై చేయండి. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)