సమ్మర్ స్పెషల్.. జొన్న గంజి..ఇలా చేసుకొని తాగితే ఆ రోగాలన్నీ పరార్!

Updated on: Apr 13, 2026 | 9:14 AM

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. అందుకే తప్పకుండా ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతుంటారు. కానీ ఈ మధ్య కాలంలో చాలా మంది జంగ్ ఫుడ్ వంటి వాటికి అలువాటు పడి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. అయితే వాటన్నిటినీ పక్కన పెట్టి, సమ్మర్‌లో ప్రతి రోజూ ఈ జొన్న గంజి తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదంట. దీని వలన బోలెడు బెన్ ఫిట్స్ ఉన్నాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. కాగా, దీనిని ఇంట్లో సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

1 / 5
కావాల్సిన పదార్థాలు : జొన్న రవ్వలే దా జొన్న పిండి, మజ్జిగ ఒక కప్పు, ఉప్పు, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, కొత్తిమీర, కొద్దిగ పూదీన, నీరు.

2 / 5
తయారీ విధానం : స్టవ్ ఆన్ చేయాలి దానిపై పాత్ర పెట్టి అందులో మూడు కప్పుల నీళ్లు పోయాలి. నీరు బాగా మరిగేలా చూసుకోవాలి. ఇక నీళ్లు బాగా మరిగిన తర్వాత అందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న జొన్న రవ్వను వేసి బాగా కలపాలి.

3 / 5
జొన్న రవ్వ ఉండలు చుట్టకుండా కలుపుతూ ఉండాలి. ఈ సమయంలో మంట లో ఫ్లేమ్‌లో ఉండాలి. రవ్వ బాగా ఉడికితే గంజిలా తయారు అవుతుంది. దీనిని బాగా చిక్కగా కాకుండా పలచగా అయ్యేలా ఉడకబెట్టుకోవాలి.

4 / 5
గంజి బాగా ఉడికిన తర్వాత ఇందులో ఉప్పు వేసి, కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇది బాగా చల్లారిన తర్వాత ఇందులో మజ్జిగ వేసి కలుపుకోవాలి.  తర్వాత ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చి మిర్చి ముక్కలు, కొత్తిమీర, పూదీన తురుము వేయాలి. వీటన్నింటినీ వేసి మంచిగా కలుపుకోవాలి.

5 / 5
తర్వాత దీనిని ఒక గంట సేపు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. తర్వాత తాగాలి అంతే చల్ల చల్లని జొన్న రవ్వ గంజి రెడీ. దీనిని ఫ్రిజ్‌లో కాకుండా నార్మల్‌గా కూడా తాగవచ్చు. దీనిని రోజూ తాగడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట.

Follow Us