
మధుమేహంతో ఇబ్బంది పడే వారు ఫుడ్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా కొందరికి ఎన్ని మందులు వాడినా కూడా బ్లడ్ షుగర్ కంట్రోల్ కాదు.. అలాంటి వాళ్లు ఈ గింజలు తీసుకుంటే ఆ సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. మరి, అస్సలు ఆలస్యం చేయకుండా ఆ గింజలు ఏంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

ఈ గింజలు ఏవో కావు.. నేరేడు పండ్లు చాలా మంది వీటిని తిని, గింజలను పారేస్తుంటారు. అయితే, ఆయుర్వేదం నిపుణులు చెబుతున్న దాని ప్రకారం, పండ్ల కంటే ఈ గింజల్లోనే ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే దీనితో మధుమేహాన్ని కూడా తగ్గించుకోవచ్చు. డయాబెటిస్ తో బాధ పడేవారు ఈ గింజలను తీసుకుంటే ఏం అవుతుందో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

నేరేడు పండ్లను తిని గింజలను పడేసే ముందు ఇది తెలిస్తే అస్సలు పడేయరు. ఇది శరీరంలో ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది. అలాగే డయాబెటిస్ ఉన్నవారికి కూడా ఇది పెద్ద వరం అని చెప్పుకోవాలి. ఇంకా దీనిలో ఉండే ఫ్లేవనాయిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ ర్యాడికల్స్‌ను మొత్తాన్ని ఇవి తొలగిస్తాయి.

డయాబెటిస్ తో బాధ పడేవారు రోజూ తింటే బ్లడ్ లో షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. ఇంకా ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని కూడా బాగా పెంచుతుంది. అంతే కాదు, అల్సర్ వంటి తీవ్ర సమస్యతో బాధ పడేవాళ్లు కూడా ఈ పొడిని మజ్జిగలో కలిపి తాగితే ఈ సమస్య తగ్గుతుంది అంతేకాదు జీర్ణ సమస్యలు కూడా ఉండవు.

అంతేకాదు, బాడీలో ఉన్న విషాలను బయటకు పంపటంలో ఇది ఎంతగానో సహాయపడుతుంది. ఇది తినడానికి కొంచం వగరుగా, పుల్లగా ఉంటుంది. ఇవి తినాలంటే కొంచం ఇబ్బందిగా ఉంటుంది. వీటిని ఎండబెట్టి పొడిగా చేసుకుని మీరు అన్నంలో కూడా తీసుకోవచ్చు.