రెండు కప్పుల ఎర్ర గోధుమ రవ్వతో చేసే స్వీట్ 5 నిముషాల్లోనే రెడీ..

Updated on: Nov 19, 2026 | 4:10 PM

తీపి వంటకాలను ఇష్టపడే వారికి ఈ బెల్లం గోధుమ రవ్వ కేసరి మంచి రెసిపీ. ఈ వంటకం ఇంచుమించుగా అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం రుచిని పోలి ఉంటుంది. గోధుమ రవ్వ, బెల్లం కలయికతో తయారయ్యే ఈ కేసరి ఆరోగ్యానికి కూడా మంచిది. కేవలం పది నిమిషాల్లోనే దీనిని ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, దశలవారీగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం..

1 / 5

2 / 5
ఒక కప్పు గోధుమ రవ్వ,  బెల్లం తురుము ముప్పావు కప్పు , నీళ్లు రెండు కప్పులు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు,  జీడిపప్పు పలుకులు కొన్ని, 
కిస్మిస్,  యాలకుల పొడి అర టీస్పూన్ తీసుకోవాలి.  ముందుగా స్టవ్ ఆన్ చేసి, ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి బాగా వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేయండి. నెయ్యి కరిగిన తర్వాత కొన్ని జీడిపప్పులు కూడా దీనిలో వేసి దోరగా వేయించుకోవాలి. జీడిపప్పు కొద్దిగా రంగు మారిన తర్వాత, కిస్మిస్ కూడా వేసి అవి ఉబ్బేంత వరకు వేయించాలి. అన్నింటినీ బంగారు రంగు వచ్చేవరకు వేయించి, ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోండి.

ఒక కప్పు గోధుమ రవ్వ, బెల్లం తురుము ముప్పావు కప్పు , నీళ్లు రెండు కప్పులు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు పలుకులు కొన్ని, కిస్మిస్, యాలకుల పొడి అర టీస్పూన్ తీసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి, ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి బాగా వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేయండి. నెయ్యి కరిగిన తర్వాత కొన్ని జీడిపప్పులు కూడా దీనిలో వేసి దోరగా వేయించుకోవాలి. జీడిపప్పు కొద్దిగా రంగు మారిన తర్వాత, కిస్మిస్ కూడా వేసి అవి ఉబ్బేంత వరకు వేయించాలి. అన్నింటినీ బంగారు రంగు వచ్చేవరకు వేయించి, ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోండి.

3 / 5
 డ్రై ఫ్రూట్స్ వేయించిన కడాయిలోనే మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేయండి. నెయ్యి కరిగిన తర్వాత అర కప్పు గోధుమ రవ్వను వేయాలి. మంటను తక్కువకు పెట్టి, రవ్వను ఐదు నుండి పది నిమిషాల పాటు దోరగా, సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. రవ్వ లేత బంగారు రంగులోకి మారి మంచి వాసన వచ్చాక దానిని ఒక ప్లేట్‌లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. రవ్వను బాగా వేయించడం వల్ల కేసరి పొడిపొడిగా, రుచిగా వస్తుంది.

4 / 5
 అదే పాన్ లో రెండు కప్పుల నీళ్లు పోయండి. ఇక్కడ అర కప్పు రవ్వకు రెండు కప్పుల నీళ్లు సరైన నిష్పత్తి. మంటను మధ్యస్థంగా ఉంచి, నీళ్లు బాగా మరుగుతున్నంత వరకు వేడి చేయండి. నీళ్లు రోలింగ్ బాయిలింగ్ దశకు చేరుకోవాలి. నీళ్లు ఇలా మరుగుతున్నప్పుడు, మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న గోధుమ రవ్వను నెమ్మదిగా కలుపుతూ వేయాలి. ఉండలు కట్టకుండా గరిటెతో బాగా కలిపి, మూత పెట్టి మధ్యస్థ మంటపై ఐదు నిమిషాల పాటు ఉడికించాలి. రవ్వ నీటిని పీల్చుకుని మెత్తగా ఉడికిపోతుంది.

5 / 5
 గోధుమ రవ్వ చక్కగా ఉడికిన తర్వాత, ఒకసారి అంతా కలిపేసుకుని, ముప్పావు కప్పు తురిమిన బెల్లాన్ని వేయండి. తీపి ఎక్కువ కావాలనుకుంటే మరో రెండు టేబుల్ స్పూన్లు అదనంగా వేసుకోవచ్చు. బెల్లం పూర్తిగా కరిగే వరకు గరిటెతో బాగా కలుపుతూ ఉండాలి. బెల్లం కరిగిన తర్వాత, కేశరి రంగు మారి, మరింత మెరుస్తూ కనిపిస్తుంది. బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత, మళ్లీ మూత పెట్టి, మంటను తక్కువకు తగ్గించి, ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇలా చేయడం వల్ల రవ్వ బెల్లం పాకాన్ని బాగా పీల్చుకుని, మరింత రుచికరంగా మారుతుంది. మిశ్రమం కొంచెం దగ్గర పడుతుంది. ఐదు నిమిషాల తర్వాత మూత తీసి, ఒకసారి అంతా బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, అర టీస్పూన్ యాలకుల పొడి, అలాగే రెండు మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి బాగా కలపాలి. నెయ్యి కలపడం వల్ల కేశరికి మంచి సువాసన వస్తాయి. ఆ తరవాత స్టవ్ ఆఫ్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us