సీనియర్ సిటిజన్లకు సూపర్ న్యూస్.. SCSS వడ్డీ రేటుపెరిగింది..! భారీగా నెలవారీ రాబడి..

|

Apr 15, 2023 | 11:58 AM

సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ ( SCSS ) ఖాతా అనేది రిటైర్మెంట్-బెనిఫిట్స్ ఖాతా. ఈ పథకానికి భారత ప్రభుత్వ మద్దతు ఉంది. తాజాగా కేంద్రప్రభుత్వం ఈ పథకాన్ని మరింత పెంచింది.

1 / 6
సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్: సీనియర్ సిటిజన్స్ కోసం అతి ముఖ్యమైన సందేశం ఇది. 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు పైబడిన సీనియర్ సిటిజన్లు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) ద్వారా డబ్బును ఆదా చేసుకోవచ్చు. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ ( SCSS ) ఖాతా అనేది రిటైర్మెంట్-బెనిఫిట్స్ ఖాతా.

2 / 6
SCSS భారతదేశంలోని సీనియర్ సిటిజన్లకు సురక్షితమైన పెట్టుబడి ఎంపికగా చెప్పొచ్చు. ఇది స్థిరమైన ఆదాయాన్ని అందిస్తుంది. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం సురక్షితం. ఖాతాను దేశవ్యాప్తంగా ఎక్కడికైనా బదిలీ చేసుకోవచ్చు.

3 / 6
2023-24 కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ పెట్టుబడి పరిమితిని రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు.

4 / 6
ఏప్రిల్ 2023తో ముగిసే త్రైమాసికంలో ప్రభుత్వం చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను 70 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది.

5 / 6
కనీస డిపాజిట్ రూ. 1000 లేదా రూ. 1000 మల్టిపుల్స్ ఎవరైనా తమ జీవిత భాగస్వామితో వ్యక్తిగతంగా లేదా ఉమ్మడిగా ఖాతాను తెరవవచ్చు. ఖాతా తెరిచిన తేదీ నుండి ఐదేళ్ల తర్వాత కావాలనుకుంటే ఖాతాను మూసివేయవచ్చు.  దానిని మూడు సంవత్సరాలు పొడిగించవచ్చు.

6 / 6
2023–24 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) వడ్డీ రేటు సంవత్సరానికి 8.2% (ఏప్రిల్-జూన్). పెట్టుబడి పెట్టిన డబ్బు త్రైమాసిక వడ్డీ చెల్లింపులకు లోబడి ఉంటుంది. ఏప్రిల్‌ నుంచి సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌పై వడ్డీ రేటు 8 శాతం నుంచి 8.2 శాతానికి పెరిగింది.