Summer special: ఎండాకాలంలో పూల్‌మఖానాని ఇలా తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

Updated on: May 21, 2025 | 4:02 PM

ఎండాకాలంలో శరీరాన్ని చల్లబరిచే ఆహారాలు తీసుకోవడం చాలా ముఖ్యం. అలాంటి వాటిలో మఖానా కూడా అతి ముఖ్యమైనది. మఖానా తీసుకోవడం వల్ల వేసవి తాపం నుంచి శరీర ఉష్ణోగ్రతని తగ్గించి చల్లదనం అందుతుంది. అంతేకాదు.. మఖానా పుష్కలమైన పోషకాలు నిండి ఉంది. ఇందులో మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్‌లు సమృద్ధిగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. మఖానీ పూర్తి లాభాలను పొందాలంటే తినే విధానం తప్పనిసరిగా తెలుసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

1 / 5
పూల్‌ మఖానా.. ఇది కూడా డ్రై ఫ్రూట్స్‌లాంటిదే. వీటిలో ఎన్నో గొప్ప ఔషధ గుణాలు ఉన్నాయి. అందుకే, వీటిని పలు రకాల మందుల తయారీలో కూడా వాడతారని నిపుణులు చెబుతున్నారు.. వీటితో కలిగే లాభాలను పూర్తిగా పొందాలంటే మఖానాని పాలలో నానబెట్టి తినడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

2 / 5
మఖానాను పాలలో నానబెట్టి తింటే పాలలోని ప్రోటీన్, కాల్షియం, మఖానాలోని ఫైబర్‌తో కలిసి సూపర్‌ఫుడ్‌గా మారుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. దీనిని తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగ్గా మారుతుంది. శరీరానికి అన్నీ పోషకాలు అందుతాయి. దీని వల్ల బాడీ ఎనర్జీగా కూడా ఉంటుంది. పాలలో నానబెట్టిన మఖానా తినటం వల్ల ఆరోగ్యంతో పాటు చర్మానికి కూడా లాభాలు ఉన్నాయి.

3 / 5
మఖానా బ్లడ్ షుగర్ లెవల్స్‌ని సరి చేస్తుంది. దీని వల్ల గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అంతేకాదు, ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ బాడీలోని ఆక్సిడెటీవ్ స్ట్రెస్‌ని తగ్గించి ఒత్తిడిని దూరం చేస్తాయి. దీని వల్ల గుండెపై అదనపు భారం కూడా తగ్గుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

4 / 5
పూల్‌ మఖానాలో హానికారక శాచురేటెడ్ కొవ్వు తక్కువగా ఉంటుంది. ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. వీటిని తింటే గుండె జబ్బులు రాకుండా ఉంటుంది.. మలబద్ధకం సమస్య కూడా రాదు. ఫూల్ మఖానాతో వండిన వంటల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ. కాబట్టి కాస్త తిన్నా పొట్ట నిండిన భావన వస్తుంది.

5 / 5
మఖానాలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల ఆటోమేటిగ్గా బరువు తగ్గుతుంది. ఇందులోని ప్రోటీన్ కారణంగా ఫుడ్ క్రేవింగ్స్ తగ్గుతాయి. ఆకలి కంట్రోల్ అవుతుంది. ఫైబర్ మీ జీర్ణవ్యవస్థ నెమ్మదిగా పనిచేసేలా చేస్తుంది. దీంతో తక్కువగా తింటారు. బరువు, బెల్లీ తగ్గుతుంది.