Oil Vs Ghee: ఇన్నాళ్లు పొరపాటు పడ్డామా?.. నూనె కంటే నెయ్యి నిజంగానే మంచిదా? అసలు విషయం తెలిస్తే..

Updated on: Aug 07, 2026 | 7:54 PM

నూనెతో పోల్చినప్పుడు నెయ్యి విషయంలో చాలా మంది చాలా సందేహాలు ఉన్నాయి. నెయ్యిలో మన శరీరానికి కావాల్సిన అనేక ఆరోగ్యమైన కొవ్వు ఉంటాయి. దీని వలన మనకు అనేక ప్రయోజనాలు ఉన్నాయని కొందరు చెబితే.. నెయ్యిలో శరీరానికి అవసరమైన మంచి కొవ్వులతో పాటు, కొలెస్ట్రాల్ స్థాయిలను, ముఖ్యంగా హానికరమైన చెడు కొలెస్ట్రాల్‌ను పెంచగల సంతృప్త కొవ్వు కూడా ఉంటాయని మరి కొందరు అంటున్నారు. కాబట్టి నెయ్యి తినడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయి. ఎలాంటి నష్టాలు ఉన్నాయో తెలుసుకుందాం.

1 / 5
నెయ్యి తింటే బరువు పెరుగుతుందా?: నెయ్యి తినడం వల్ల బరువు పెరుగుతారని చాలా మంది అనుకుంటారు. కానీ లిమిట్‌లో తింటే కేవలం నెయ్యి వల్ల మాత్రమే బరువు పెరగరరని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఏ ఆహారమైనా తీసుకునే పరిమాణంపైనే ఆధారపడి ఉంటుందని.. అయితే ఎక్కువ మోతాదులో తింటే కొలెస్ట్రాల్ పెరిగి బరువు పెరిగే అవాకశం ఉందని చెబుతున్నారు.

2 / 5
నెయ్యి వల్ల రక్తనాళాలు పూడుకుపోతాయా?: అయితే నెయ్యి నేరుగా వెళ్లి రక్తనాళాల్లో పేరుకుపోదు. కానీ అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు పెరిగి, గుండె సంబంధిత సమస్యల ప్రమాదం పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. అలాగే నెయ్యి కడుపులో  అల్సర్లను నయం చేస్తుందని చాలా మంది అంటారు. కానీ దీనికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. అయితే ఇందులో ఉండే బ్యూట్రిక్ యాసిడ్ జీర్ణక్రియకు కొంత సహాయపడుతుంది.

3 / 5
రోజుకు ఎంత నెయ్యి తినవచ్చు?: ICMR మార్గదర్శకాల ప్రకారం.. ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తి రోజుకు మొత్తంలో 27 నుండి 30 గ్రాముల కొవ్వు అంటే నూనెలోనైనా, నెయ్యిలోనైనా మాత్రమే తీసుకోవాలి. నెయ్యిలో 60-65 శాతృరేటెడ్ కొవ్వు ఉంటుంది. కాబట్టి గుండె ఆరోగ్యానికి రోజుకు సగం స్పూన్ కంటే ఎక్కువ తీసుకోకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

4 / 5
పిల్లలకు నెయ్యి పెట్టడం మంచిదేనా? అంటే చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో విటమిన్-E, విటమిన్-K పుష్కలంగా ఉంటాయి. ఇవి పిల్లల నాడీ వ్యవస్థ అభివృద్ధికి, చర్మ ఆరోగ్యానికి, జీర్ణక్రియ మెరుగుపరుస్తాయని చెబుతున్నారు. అయితే పరగడుపున నెయ్యి తింటే కొవ్వు కరుగుతుందా? అంటే కాదనే అంటున్నారు వైద్యులు. నెయ్యిలో బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను పెంచే శాతృరేటెడ్ కొవ్వు ఉంటుంది కాబట్టి దీనివల్ల కొవ్వు కరగదని చెబుతున్నారుజ.

5 / 5
నెయ్యి నూనె కంటే మంచిదా? అంటే నూనె కంటే నెయ్యి మేలని చెప్పడానికి ఆధారాలు లేవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నూనె స్థానంలో రోజువారీ వంటల్లో నెయ్యి వాడటం హానికరమని చెబుతున్నారు. నెయ్యి రుచి కోసం అప్పుడప్పుడు మాత్రమే వాడాలని సూచిస్తున్నారు. అలాగే డమాబెటీస్‌తో బాధపడే వ్యక్తులు నెయ్యికి దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. లేదా పూర్తిగా మానుకోవడమే బెటర్ అంటున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us