సంవత్సరం పాటు నిల్వ ఉండే పచ్చిమిర్చి ఆవకాయ! ముద్ద ముద్దకు నూరూరించే అసలైన సీక్రెట్ రెసిపీ

Updated on: May 19, 2026 | 2:56 PM

మన తెలుగు వారి భోజనంలో ఊరగాయలు, ఆవకాయలకు ఉండే స్థానమే వేరు. కూరలు ఎన్ని ఉన్నా, వేడి వేడి అన్నంలో కొద్దిగా పచ్చడి వేసుకుని తింటే వచ్చే తృప్తే వేరు. సాధారణంగా ఆవకాయ అనగానే మనకు మామిడికాయ మాత్రమే గుర్తొస్తుంది. కానీ, పచ్చిమిరపకాయలతో కూడా సంవత్సరం పాటు అస్సలు పాడవకుండా, ఎంతో రుచికరమైన ఆవకాయ పచ్చడి పెట్టుకోవచ్చని చాలా మందికి తెలియదు.

1 / 5
ఇళ్లల్లో కూరలు ఏమీ లేనప్పుడు లేదా ఎప్పుడైనా కాస్త స్పైసీగా, పుల్లపుల్లగా తినాలనిపించినప్పుడు ఈ పచ్చిమిర్చి ఆవకాయ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఇది కేవలం అన్నంలోకే కాకుండా చపాతీ, పూరీ, పరాఠా మరియు దోశల్లోకి కూడా నంచుకోవడానికి చాలా బాగుంటుంది. ఎంతో సులువుగా, ఇంట్లోనే పక్కా కొలతలతో ఈ నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

2 / 5
ఈ ఆవకాయ తయారీ కోసం ముందుగా ఒక అరకిలో మంచి పచ్చని, తాజాగా ఉన్న పచ్చిమిరపకాయలను తీసుకోవాలి. మరీ ఎక్కువ కారంగా ఉండేవి కాకుండా మీడియం సైజులో ఉండే మిరపకాయలు దీనికి చక్కగా సరిపోతాయి. వీటిని నీళ్లలో శుభ్రంగా కడిగిన తర్వాత, తడి ఏమాత్రం లేకుండా ఒక పొడి గుడ్డతో పూర్తిగా తుడుచుకోవాలి. నిల్వ పచ్చళ్లకు తడి తగిలితే త్వరగా బూజు పడతాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించాలి.

3 / 5
ఆ తర్వాత పచ్చిమిర్చిని నచ్చిన సైజులో ముక్కలుగా కట్ చేసుకుని, వీలైతే అందులో ఉండే గింజలను కొన్నింటిని వేరు చేయాలి. దీనివల్ల పచ్చడి మరీ ఎక్కువ కారంగా లేకుండా తినడానికి అనువుగా మారుతుంది. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులో కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలను వేయాలి. దీనికి ఒక కప్పు కారం పొడి, అర కప్పు ఉప్పు (మీ రుచికి తగినంత), పావు కప్పు ఆవపొడి, మరియు కొద్దిగా మెంతి పొడిని జోడించాలి. ఆవపొడి, మెంతి పొడి వల్లే ఆవకాయకు అసలైన రుచి మరియు సువాసన వస్తాయి.

4 / 5
 తర్వాత ఇందులో ఒక అర కప్పు దాకా తాజాగా పిండిన నిమ్మరసం పోయాలి. నిమ్మరసం పచ్చడికి మంచి పులుపును ఇవ్వడమే కాకుండా ముక్కలు త్వరగా ఊరడానికి, ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి సహాయపడుతుంది. చివరగా ఒక అర కప్పు మంచి నూనె (వేరుశనగ నూనె లేదా నువ్వుల నూనె) పోసి మసాలాలన్నీ ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి.

5 / 5
ఇలా కలుపుకున్న పచ్చడిని ఒక పొడి గ్లాస్ జార్ (గాజు సీసా) లేదా ప్లాస్టిక్ డబ్బాలోకి తీసుకుని మూత పెట్టి మూడు రోజుల పాటు పక్కన ఉంచాలి. మూడు రోజుల తర్వాత మూత తీసి చూస్తే నూనె పైకి తేలి, పచ్చిమిర్చి ముక్కలు చక్కగా ఊరి ఉంటాయి. ఒకసారి ఉప్పు, కారం సరిచూసుకుని పచ్చడిని మళ్లీ బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన, ఘాటైన పచ్చిమిర్చి ఆవకాయ సిద్ధం. సంవత్సరం అంతా కమ్మని రుచితో ఉండే ఈ ఆవకాయను మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి చూడండి.

Follow Us