Indian Railways: ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్.. ట్రైన్‌లో మొబైల్ ఛార్జింగ్‌పై ఆంక్షలు.. ఇవే కొత్త రూల్స్!

Updated on: Oct 28, 2026 | 12:52 PM

ఈ మధ్యకాలంలో రైలు బోగీల్లో పెరుగుతున్న అగ్ని ప్రమాదాల దృష్ట్యా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రమాదాలను తగ్గించేందుకు ఇకపై అన్ని రైళ్లలో రాత్రి వేళల్లో మొబైల్ ఛార్జింగ్ పాయింట్లను తప్పనిసరిగా నిలిపివేయాలని రైల్వే బోర్డు అన్ని జోనల్ రైల్వేలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అక్టోబర్ 26న అధికారిక ప్రకటన విడుదల చేసింది.

1 / 5
రైలు బోగీల్లో పెరుగుతున్న అగ్ని ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాత్రి వేళల్లో ప్రయాణికులు మొబైల్ ఫోన్లు ఛార్జింగ్ పెట్టుకోవడానికి అనుమతి ఉండదు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అన్ని రైళ్లలోని మొబైల్ ఛార్జింగ్ పాయింట్లను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. గతంలోనే ఈ ఆదేశాలు జారీ చేసినప్పటికీ, ప్రస్తుతం వాటి అమలును మరింత కఠినతరం చేసింది. అక్టోబర్ 26న కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.

2 / 5
రైల్వే శాఖ మార్గదర్శకాల ప్రకారం.. రైళ్లలో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఛార్జింగ్ పాయింట్లను నిలిపివేయాలనే నిబంధనను తొలిసారిగా 2014 జూన్ 19న తీసుకొచ్చారు. అయితే, రైల్వే సిబ్బంది ఈ నిబంధనలను సరిగ్గా పాటించకపోవడంతో అగ్ని ప్రమాదాల ముప్పు కొనసాగుతోంది.

3 / 5
తాజాగా సౌత్ ఈస్టర్న్ రైల్వే పరిధిలో చోటుచేసుకున్న ఘటన ఈ నిబంధనలను మరోసారి తెరపైకి తెచ్చింది. ఇటీవల ఓ రైలులో రైల్వే సిబ్బంది సమయానికి మొబైల్ ఛార్జింగ్ పాయింట్లను ఆఫ్ చేయకపోవడంతో, ఆ రైలులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి తన పవర్ బ్యాంక్‌ను ఛార్జింగ్‌కు పెట్టాడు. అయితే, కొద్దిసేపటికే అది పేలిపోయింది. దీంతో అప్రమత్తమైన రైల్వే శాఖ ప్రయాణికుల భద్రత దృష్ట్యా ముందస్తు జాగ్రత్తలను మరింత కఠినతరం చేసింది.

4 / 5
తాజా ఆదేశాల ప్రకారం.. ప్రతి రోజూ రాత్రి 11 గంటలు కాగానే రైలులోని మొబైల్ ఛార్జింగ్ పాయింట్లను సిబ్బంది స్విచ్ ఆఫ్ చేయాలి. తిరిగి ఉదయం 5 గంటలకు వాటన్నింటినీ ఆన్ చేయాలి. ఈ నిబంధనల అమలులో ఎలాంటి మినహాయింపులు ఉండకూడదని, నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకుంటామని రైల్వే బోర్డు స్పష్టం చేసింది.

5 / 5
రైల్వే సిబ్బందికి ఈ అంశంపై పూర్తిస్థాయి శిక్షణ ఇవ్వడంతోపాటు, వారిలో అవగాహన పెంచాలని బోర్డు ఆదేశించింది. అలాగే, నిబంధనలు సరిగ్గా అమలవుతున్నాయో లేదో తెలుసుకునేందుకు అధికారులు, సూపర్‌వైజర్లు తరచూ ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని సూచించింది.

Loading...
Unable to load recommendations.
Follow Us