
అయితే నాగు పాముల్లో పాముల్లో కూడా రెండు రకాలు ఉంటాయి. అందులో నాగు, మరొకటి గిరి నాగు. అసలు ఈ రెండింటిలో ఏది ఎక్కువ విషాన్ని కలిగి ఉంటుంది. ఈ రెండు పాముల మధ్య తేడాలు ఏంటి? దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారు అనేది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

నాగు పాము విషయానికి వస్తే ఇది ఎక్కువగా జనావాసాల్లో కనిపిస్తుంటుంది. అంతే కాకుండా పంట పొలాల్లో కూడా పాము ఎక్కువగా కనిపిస్తుంది. ఇక గిరి నాగు విషయానికి వస్తే ఇది ఎక్కువగా అడవుల్లో ఉంటుంది. నాగు పాము బంగారు వర్ణంలో ఉంటే, గిరి నాగు మాత్రం నలుపు రంగులో ఉంటుంది. ఇక నాగు పామును ఇండియన్ కోబ్రా, గిరి నాగు కింగ్ కోబ్రా అంటారు. అయితే చాలా మంది ఈ రెండు పాములు కూడా వేర్వేరు జాతికి చెందినవి అనుకుంటారు. కానీ ఇవి రెండు కూడా ఎలపిడే అనే కుటుంబానికి చెందినవి.

కింగ్ కోబ్రా విషయానికి వస్తే అసలు ఇది నిజమైన కోబ్రా కాదు అని చెబుతున్నారు నిపుణులు. ఇది ఓఫియోఫాగస్ జెనస్‌కు చెందినదంట. అన్ని పాముల కంటే భిన్నంగా ఈ పాము ఎక్కువగా ఇతర పాములను తినే ఆహారపు అలవాటు కలిగి ఉంటుంది అని చెబుతున్నారు నిపుణులు. అలాగే నాగు పాము కంటే ఇది అంత విషపూరితమైనది కూడా కాదంట. నాగు పాము చాలా విషపూరితమైనది, దీని విషం ఎల్ డీ 50 విలువ 0.56 మిల్లీ గ్రాములు ఉటుందంట. ఈ పాము ఒక్క కాటుతో 10 మందిని చంపుతుంది. ఇక కింగ్ కోబ్రా అన్ని పాముల కంటే చాలా పొడవైనది. కానీ దీని విషం చాలా తక్కువ శక్తి కలిగినది, ఇది 50 1.28 మి. గ్రాముల విషాన్ని కలిగి ఉంటుంది.

గిరి నాగు ఎక్కువగా అడవుల్లో దక్షిణ, తూర్పు ఆసియాలో ఎక్కువగా కనిపిస్తుంది. నాగు పాము మాత్రం ఎక్కువగా ఇండియాలోనే కనిపిస్తుంది. అన్ని పాముల్లో కెళ్లా గిరి నాగు చాలా పొడవు, బరువుతో ఉంటుందంట. అంతే కాకుండా ఇది పడగ విప్పినప్పుడు కళ్లు అద్దాలు పెట్టుకున్న విధంగా గ్లాస్ లాంటి పొరను కలిగి ఉంటుంది. ఇక ఈ రెండింటిలో ఎక్కువగా నాగు పాము మాత్రమే చాలా ప్రమాదకరం అంటున్నారు నిపుణులు.

ఇక సంతానం విషయంలో కూడా నాగు పాము కంటే గిరి నాగు మాత్రమే ఎక్కువగా గుడ్లు పెడుతుంది. అంతే కాకుండా వాటిని కాపాడటం, తన పిల్లలను రక్షించుకోవడంలో కూడా గిరినాగు చాలా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుందంట. ఇది ఎక్కువగా ఆకులతో గూడు కడుతుంది. అంతే కాకుండా గిరి నాగు దాదాపు 20 నుంచి 40 పైన గుడ్లు పెడుతుంది. ఇక నాగు పాము 10 నుంచి 30 గుడ్లు పెడుతుంది. ఇది ఎక్కువ పుట్టల్లో , ఎర్రటి హోల్స్‌ల్లో గుడ్లు పెట్టి వాటిని రెండు నెలలు మాత్రమే కాపాడుతుంది.