హైదరాబాద్ టూ ఊటీ.. అతి తక్కువ ధరలో కూల్ ట్రిప్.. ఐఆర్‌సీటీసీ అదిరే ప్యాకేజీ ఇదే..

Updated on: Mar 22, 2026 | 3:50 PM

Hyderabad to Ooty IRCTC Package: మండుతున్న ఎండల నుంచి ఉపశమనం.. పచ్చని కొండల మధ్య చల్లని పయనం.. ప్రకృతి ప్రేమికుల కలల స్వర్గధామం.. ఊటీని సందర్శించాలనుకుంటున్నారా? అయితే ఐఆర్‌సీటీసీ మీకోసం అదిరిపోయే సమ్మర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి కేవలం ఐదు రోజుల్లో ఊటీ, కూనూర్ అందాలను చూసి రావడానికి అల్టిమేట్ ఊటీ టూర్ సిద్ధమైపోయింది. ఈ వేసవిలో మీ ఫ్యామిలీతో కలిసి కూల్ ట్రిప్ ప్లాన్ చేయాలనుకుంటే, ఆ వివరాలు ఇక్కడ తెలుసుకోండి..

1 / 5
ఎండలు ముదురుతున్న వేళ చల్లని కొండకోనల మధ్య సేదతీరాలనుకునే పర్యాటకుల కోసం ఐఆర్‌సీటీసీ ఒక అద్భుతమైన అవకాశాన్ని తీసుకొచ్చింది. అల్టిమేట్ ఊటీ ఎక్స్-హైదరాబాద్ పేరుతో ఊటీ, కూనూర్ వంటి ప్రపంచ ప్రసిద్ధి గాంచిన హిల్ స్టేషన్లను సందర్శించేందుకు ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ప్రకృతి ఒడిలో పచ్చని టీ తోటలు, జలపాతాలు, నీలగిరి కొండల సౌందర్యాన్ని ఆస్వాదించాలనుకునే వారికి ఇది ఒక చక్కని ప్లాన్ అని చెప్పవచ్చు.

2 / 5
ఈ టూర్ మొత్తం ఐదు రాత్రులు, ఆరు రోజుల పాటు సాగుతుంది. ప్రతి మంగళవారం మధ్యాహ్నం 2:25 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి శబరి ఎక్స్‌ప్రెస్ ద్వారా ఈ యాత్ర ప్రారంభమవుతుంది. హైదరాబాద్ వాసులతో పాటు నల్గొండ, గుంటూరు, తెనాలి ప్రాంతాల వారు కూడా తమకు సమీపంలోని స్టేషన్లలో రైలు ఎక్కేందుకు ఐఆర్‌సీటీసీ బోర్డింగ్ సౌకర్యం కల్పించింది. తిరుగు ప్రయాణంలో కూడా పర్యాటకులు ఇదే స్టేషన్లలో దిగవచ్చు.

3 / 5
ఈ ట్రిప్ కోసం ఐఆర్‌సీటీసీ రెండు రకాల విభాగాలను అందుబాటులోకి తెచ్చింది. కంఫర్ట్ (3 టైర్ ఏసీ), స్టాండర్డ్‌లో ప్రయాణికులు తమ బడ్జెట్‌ను బట్టి టికెట్లు బుక్ చేసుకోవచ్చు. మార్చి 24 వరకు తక్కువ ధరలు అందుబాటులో ఉండగా వేసవి రద్దీ దృష్ట్యా మార్చి 31 నుండి జూన్ 23 వరకు ధరలు పెరగనున్నాయి. పెరిగిన ధరల ప్రకారం.. కంఫర్ట్ విభాగంలో ఇద్దరు కలిసి షేర్ చేసుకుంటే ఒక్కొక్కరికి రూ. 18,890 కాగా, స్టాండర్డ్ విభాగంలో ఇద్దరికి రూ. 16,360 చొప్పున ఛార్జీలు వర్తిస్తాయి. ఐదేళ్ల పైబడిన పిల్లలకు కూడా ప్రత్యేక ధరలు నిర్ణయించారు.

4 / 5
తొలిరోజు సికింద్రాబాద్‌లో ప్రయాణం మొదలై, రెండో రోజు ఉదయం కోయంబత్తూరు చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో ఊటీకి వెళ్లి హోటల్‌లో బస చేస్తారు. రెండో రోజు బొటానికల్ గార్డెన్, ఊటీ లేక్ సందర్శన ఉంటుంది. మూడో రోజు దొడబెట్టా పీక్, టీ మ్యూజియం, పైకారా ఫాల్స్ చూపిస్తారు. నాలుగో రోజు కూనూర్ అందాలను వీక్షించి తిరిగి ఊటీ చేరుకుంటారు. ఐదో రోజు హోటల్ చెక్-అవుట్ చేసి కోయంబత్తూరు నుంచి తిరుగు ప్రయాణం మొదలవుతుంది. ఆరో రోజు ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్ చేరుకోవడంతో యాత్ర సుఖాంతమవుతుంది.

5 / 5
ఈ ప్యాకేజీ తీసుకున్న వారికి రైలు టికెట్లు, మూడు రోజుల పాటు హోటల్ వసతి, స్థానికంగా సందర్శనీయ ప్రాంతాలకు వెళ్లడానికి ఏసీ వాహన సౌకర్యం కల్పిస్తారు. అయితే మధ్యాహ్నం, రాత్రి భోజనం, విహార కేంద్రాల వద్ద ఎంట్రీ టికెట్లు, బోటింగ్ వంటి వ్యక్తిగత ఖర్చులను పర్యాటకులే భరించాల్సి ఉంటుంది. ప్రయాణానికి నాలుగు రోజుల ముందు మాత్రమే ఫైనల్ టికెట్లు జారీ చేస్తారు.

Follow Us