
నేటి వేగవంతమైన జీవనశైలిలో జుట్టు, చర్మం సంరక్షణ సవాలుతో కూడుకున్న విషయం. ముఖ్యంగా జుట్టును జాగ్రత్తగా చూసుకోకపోతే అనేక సమస్యలు తలెత్తుతాయి.

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరికి జుట్టు రాలడం అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. ఎన్ని చికిత్సలు తీసుకున్నా జుట్టు రాలడం సమస్య తగ్గడం లేదు. ఇలాంటి సందర్భంలో ఇంటి నివారణల ద్వారా తేలికగా సమస్యకు చెక్ పెట్టవచ్చు.

టీ, కాఫీ వల్ల కూడా జుట్టుకు ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రెండు పదార్థాలు జుట్టుకు మేలు చేస్తాయి. చుండ్రును తగ్గించడం నుంచి శీతాకాలంలో తలెత్తే అన్ని జుట్టు సమస్యలకు ప్రయోజనకరంగా ఉంటుంది.

జుట్టు పెరుగుదలకు టీ పొడిని ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకుందాం.. ముందుగా టీ తయారు చేసిన తర్వాత డికాషన్ వడకట్టాలి. ఆ తర్వాత మిగిలిపోయిన టీ ఆకులను వేడినీటిలో వేయాలి. తరువాత కొంచెంగా చల్లబరచాలి.

ఆ తర్వాత దీన్ని మీ జుట్టుకు అప్లై చేయండి. ఇది జుట్టు రాలడంతో పాటు చుండ్రు సమస్యను శాశ్వతంగా వదిలించుకోవడానికి సహాయపడుతుంది. ఇది జుట్టు సమస్యలకు ప్రయోజనకరంగా ఉంటుంది.