కొత్తిమీర 10 రోజులైనా తాజాగా ఉండాలా? ఈ సింపుల్‌ చిట్కాలు పాటించండి!

Updated on: May 08, 2026 | 1:18 PM

వంటకు అద్భుతమైన రుచిని, సువాసనను ఇచ్చే కొత్తిమీర మార్కెట్ నుంచి తెచ్చిన రెండు రోజులకే వాడిపోతుంటుంది. కిచెన్‌లో కొత్తిమీర త్వరగా వాడిపోవడం అనేది గృహిణులకు పెద్ద సమస్య. కానీ కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే, మీ ఫ్రిజ్‌లో కొత్తిమీర వారం పది రోజులైనా అప్పుడే తెచ్చినట్లు తాజాగా ఉంటుంది. ఆ సులభమైన మార్గాలేంటో ఇక్కడ చూద్దాం..

1 / 5
పసుపు ఆకులను తొలగించండి: కిచెన్‌లో కొత్తిమీర త్వరగా వాడిపోవడం అనేది గృహిణులకు పెద్ద సమస్య. దీనిని 10 రోజుల వరకు పచ్చగా, తాజాగా ఉంచేందుకు కొన్ని చిట్కాలు పాటించాలి. మార్కెట్ నుంచి కొత్తిమీర తీసుకువచ్చిన వెంటనే దానిని శుభ్రం చేయండి. అందులో ఉన్న పసుపు పచ్చని ఆకులు, కుళ్ళిన కాడలను ముందే తీసేయాలి. లేదంటే అవి మిగిలిన కట్టను కూడా త్వరగా పాడు చేస్తాయి.

2 / 5
తడి లేకుండా చూసుకోండి: కొత్తిమీరను కడిగిన తర్వాత అందులో ఏమాత్రం తేమ ఉండకూడదు. ఒక కాటన్ క్లాత్‌పై పరిచి ఫ్యాన్ కింద పూర్తిగా ఆరబెట్టాలి. తడి ఉంటే బ్యాక్టీరియా చేరి త్వరగా కుళ్ళిపోతుంది. అందుకే కొత్తిమీరను కడిగిన తర్వాత పూర్తిగా ఆరబెట్టడం, తడి లేకుండా టిష్యూ పేపర్‌లో చుట్టి ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెట్టడం వంటి పద్ధతులు ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తాయి.

3 / 5
వేర్లు కట్ చేయడం: అలాగే వేర్లను కట్ చేసి గ్లాసు నీళ్లలో ఉంచడం ద్వారా కూడా దానిని తాజాగా ఉంచవచ్చు. కొత్తిమీర కాడల చివరన ఉండే వేర్లను కత్తిరించడం వల్ల నిల్వ ఉంచడం సులభమవుతుంది. అయితే కేవలం ఆకులే కాకుండా కాడలను కూడా కలిపి ఉంచడం వల్ల సువాసన ఎక్కువగా ఉంటుంది.

4 / 5
జిప్‌లాక్ బ్యాగులు: డబ్బాలు లేని పక్షంలో జిప్‌లాక్ బ్యాగులను వాడవచ్చు. గాలి చొరబడకుండా జిప్ లాక్ చేసే ముందు లోపల ఒక టిష్యూ పేపర్ ఉంచడం మర్చిపోవద్దు. లేదంటే, కొత్తిమీరను అల్యూమినియం ఫాయిల్‌లో చుట్టి ఫ్రిజ్‌లో ఉంచడం ద్వారా కూడా గాలి తగలకుండా ఎక్కువ రోజులు నిల్వ చేయవచ్చు. ఈ చిట్కాలను పాటిస్తే కొత్తిమీర పదే పదే కొనాల్సిన పని లేకుండా, ఇంట్లోనే పచ్చగా వాడుకోవచ్చు.

5 / 5
ఎయిర్ టైట్ కంటైనర్: శుభ్రం చేసిన కొత్తిమీరను ఒక ప్లాస్టిక్ లేదా గ్లాస్ డబ్బాలో భద్రపరచండి. డబ్బా అడుగున, పైన టిష్యూ పేపర్‌ను ఉంచడం వల్ల అది తేమను పీల్చుకుని కొత్తిమీరను పొడిగా ఉంచుతుంది. ఒకవేళ మీరు వేర్లతో సహా ఉంచాలనుకుంటే, ఒక గ్లాసులో కొద్దిగా నీళ్లు పోసి, వేర్లు మునిగేలా అందులో ఉంచండి. దీనిని ఫ్రిజ్‌లో పెడితే తాజాగా ఉంటుంది. అయితే రెండు రోజులకోసారి నీటిని మారుస్తూ ఉండాలి.

Follow Us