Shopping Tips: కిరాణా షాపింగ్‌కు వెళ్తున్నారా?.. ఈ సింపుల్ టిప్స్‌ తెలిస్తే సగం డబ్బు ఆదా చేసుకోవచ్చు..

Updated on: Mar 27, 2026 | 5:10 PM

ప్రస్తుత రోజుల్లో అన్ని నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగిపోయాయి. కాబట్టి మనం ఇంట్లోకి కావాల్సిన వాటిని కొనుగోలు చేసే విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లేదంటో మీ జేబుకు పెద్ద చిల్లు పడడం ఖాయం. కాబట్టి మనం షాపింగ్‌కువ వెళ్లే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. అవును షాకింగ్‌కు వెళ్లినప్పుడు మనం కొన్ని టిప్స్ పాటించడం వల్ల చాలా డబ్బును ఆదా చేసుకోవచ్చు అదెలానో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

1 / 5
బడ్జెట్: మీరు షాపింగ్‌ వెళ్లినప్పుడు ఎక్కవ డబ్బులు ఖర్చు అవ్వకుండా ఉండాలంటే.. ముందుగా మీరు ఈ వీక్‌ ఎలాంటి ఆహారాలు తినాలో ముందే ప్లాన్ చేసుకోండి, దానికి అవసరమైన వస్తువులను మాత్రమే కొనుగోలు చేయండి. ఇలా చేయడం ద్వారా మీరు అనవసరమైన వాటిని కొనకుండా డబ్బులు ఆదా చేసుకోవచ్చు.

2 / 5
బల్క్‌ షాపింగ్: మీరు ఇంట్లోకి కావాల్సిన వస్తువల కోసం మళ్లీ మళ్లీ షాపింగ్‌కు వెళ్లకుండా ఒకేసారి పెద్ద మొత్తంలో వస్తువులను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించండి. ఇలా చేయడం ద్వారా మీరు డబ్బును ఆదా చేసుకోవచ్చు. అంతేకాకుండా మీరు రోజు వాడే బియ్యం, గోధుమలు, పప్పులు, వంటి వాటిని మీరు రిటైల్ దుకాణాల నుండి కాకుండా నేరుగా హోల్‌సెల్‌ నుంచి కొనుగోలు చేయండి, బల్క్‌లో తీసుకున్నప్పుడు ఆఫర్స్ లేదా ధర తగ్గించి ఇచ్చే అవకాశం ఉంటుంది.

3 / 5
కూపన్ కార్స్, క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్‌: చాలా సూపర్‌ మార్కెట్‌లు ఇప్పుడు కొత్తగా కూపన్ కార్డ్స్‌ ఇస్తూ వాటిపై ఆఫర్స్‌ను ప్రకటిస్తున్నాయి. మరి కొన్ని స్టోర్స్‌లో క్రెడిట్‌ కార్డుపై కూడా డిస్కౌంట్స్ ఉంటున్నాయి. అలాంటి స్టోర్స్‌ను గుర్తించి.. ఎప్పుడు ఆఫర్స్ ఉంటాయో ఆ సమయంలో షాపింగ్ చేయడం వల్ల మీరు కొనుగోలు చేసే వస్తువుల ధరలపై తగ్గింపు పొందవచ్చు. ఇది కూడా డబ్బును ఆదా చేసుకునేందుకు బెస్ట్ ఆప్షన్.

4 / 5
స్థానిక ఉత్పత్తులు: చాలా మంది సీజనల్‌ కూరగాయలు, పండ్లను సూపర్‌ మార్కెట్‌ల నుంచి కొనుగోలు చేస్తారు. కానీ ఇవి సీజనల్ పండ్లు కావడంతో వీటి లభ్యత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ధరలు తక్కువగా ఉంటాయి. స్థానిక మార్కెట్‌లో ఇవి ఎక్కువగా లభిస్తాయి. మీరు వీటిని సూపర్ మార్కెట్‌ నుంచి కొనే బదులు స్థానిక మార్కెట్‌లో తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఇలా చేయడం ద్వారా కూడా మీరు డబ్బును ఆదా చేసుకోవ్చు.

5 / 5
ప్యాక్‌డు ఫుడ్స్: చాలా మంది సమయం లేక ప్రాసెస్ చేసిన ఇప్పటికే వండిన పదార్థాలను ఎక్కువగా కొనుగోలు చేసేందుకు ఇష్టపడతారు. కానీ ఈ ఆహారాలు ఎల్లప్పుడూ ఖరీదైనవిగా ఉంటాయి. కాబట్టి, ఎప్పుడూ మీరు ఇంట్లోనే వాటిని వండుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఆహారాన్ని కూడా ఎక్కువగా వృధా చేకండి. ఫుడ్‌ వేస్ట్ కాకుండా ఉండేందుకు మీ కటుంబానికి అవసరైమనంత ఆహారం మాత్రమే వండుకోండి. అలాగే ఆహారాన్ని సరిగ్గా నిల్వ చేసుకోండి. ఈ టిప్స్ పాటించడం ద్వారా మీరు చాలా వరకు డబ్బును ఆదా చేసుకోవచ్చు.

Follow Us