
ఇల్లు తుడవడానికి: సాధారణంగా మనం ప్రతి రోజూ ఇంటిని క్లీన్ చేస్తూ ఉంటాం. ఇందుకోసం ఇంట్లోని ట్యాబ్ వాటర్ వాడుతాం. అలా కాకుండా సాధారణ ట్యాబ్ వాటర్ కాకుండా.. RO వాటర్ ప్యూరిఫైయర్ నుండి బయటకు వచ్చే వ్యర్థ నీటిని ఇంటిని శుభ్రం చేయడం కోసం వాడుకోవచ్చు. ఇంటిని తుడవడానికి, క్లీన్ చేయడానికి దీనిని చక్కగా వినియోగించుకోవచ్చు.

గార్డెనింగ్ కోసం: సాధారణంగా మన పెరట్లో ఉన్న మొక్కల పెరుగుదలకు చాలా మంది ఇంట్లోని ట్యాబ్ వాటర్ ఉపయోగిస్తారు. వాటి ప్లేస్‌లో మీరు ఫ్యూరీఫైయర్ నుంచి వచ్చే వేస్ట్ వాటర్‌ను వాడుకోచ్చు. అయితే ఈ వాటర్‌ను వాడే ముందు మొక్కలకు ఏదైనా ఎఫెక్ట్ అవుతుందో లేదో అని తెలుసుకునేందుకు తొలుత కొన్ని మొక్కలపై నీటిని పోసి చూడండి.. వాటికి ఎలాంటి ప్రభావం లేకపోతే ఆ నీటిని వాడుకోవచ్చు.

వంటపాత్రల క్లీనింగ్: వాటర్ ప్యూరిఫైయర్ నుంచి వచ్చే వ్యర్థ నీటిని సద్వినియోగం చేసుకోవడానికి మరో ఉత్తమమైన మార్గం వంట పాత్రలను క్లీన్ చేయడం. నార్మల్‌గా ప్యూరీఫైయర్‌కు ఉండే వేస్ట్ వాటర్ పైపును కిచెన్ సింక్ వైపుగానే చాలా మంది ఉంచుతారు. కాబట్టి, ఆ నీటితో గిన్నెలు, ఇతర పాత్రలను సులభంగా శుభ్రం చేసుకోవచ్చు.

వాహనాల క్లీనింగ్: ఈ వేస్ట్ వాటర్‌ను సద్వినియోగం చేసుకోవడానికి మరో బెస్ట్ ఆప్షన్ ఏమిటంటే.. టాయిలెట్, వాహనాల క్లీనింగ్. నార్మల్‌గా వాహనాలను కడిగేందుకు బకెట్లు బకెట్లు వాటర్ అవసరం అవుతూ ఉంటాయి. ప్రస్తుతం ఎల్‌నీనో ఎఫెక్ట్‌తో నీటి కొరత ఉంది. కాబట్టి ఇలా నీటిని వృథా చేయకుండా.. వృథా నీటిని మళ్లీ ఉపయోగించుకోవడం ఉత్తమం.

అంతేకాదు ప్రస్తుతం ఎల్‌నీనో ఎఫెక్ట్‌తో ఉష్నోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. కాబట్టి చాలా మంది ఇప్పటికీ కూలర్లను వాడుతున్నారు. వాటి కూలింగ్ కోసం జనాలు ఇంట్లోని సాధారణ వాటర్‌ను ఉపయోగిస్తారు. అలా కాకుండా ఫ్యూరిఫైయర్ నుంచే వచ్చే వాటర్ దీనిని వాడుకోవచ్చు. ఈ పద్ధతులన్నింటి ద్వారా నీటిని రీ-యూజ్ చేయడం చాలా ఉపయోగకరమే అయినప్పటికీ, దీనికి కాస్త సమయం, శ్రమ అవసరం. అందుకే ప్యూర్ ఇట్ సంస్థ ప్యూర్ ఇట్ ఎకో వాటర్ సేవర్ అనే వాటర్ ప్యూరిఫైయర్‌ను తీసుకొచ్చింది. ఇది ఎకో రికవరీ టెక్నాలజీ ని ఉపయోగించి. నీటిని ఎక్కవ వేస్ట్ చేయకుండా ఆదా చేస్తుంది.