Dark Circles: ఖరీదైన బ్యాటీ ప్రాడక్ట్స్‌ వద్దు.. అరటి తొక్కతో డార్క్ సర్కిల్స్‌కు చెక్ పెట్టండిలా!

Updated on: Nov 28, 2026 | 1:14 PM

ఈ మధ్యకాలంలో నిద్రలేమి, రాత్రి ఎక్కువ సమయం ఫోన్ చూడడం వల్ల చాలా మంది కళ్ల కింద నల్లటి వలయాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. వీటిని పోగొట్టుకునేందుకు బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరుగుతూ డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నారు. కానీ మనం తిని పడేసే అరటి తొక్కతో ఈ నల్ల వలయాలను ఈజీగా పోగొట్టవచ్చని చాలా మందికి తెలియదు. అదెలానో ఇక్కడ చూద్దాం.

1 / 5
ఒక వ్యక్తి అందంగా కనిపించాలంటే.. అందులో అతని కళ్లు కీలక పాత్రను పోషిస్తాయి. కానీ ఈ మధ్యకాలంలో చాలా మందికి నిద్రలేమి కారణంగా కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడి అవి వారి అందాన్ని పాడు చేస్తాయి. మరి వీటిని తొలగించడం ఎలా.. అందుకోసం ఖరీదైన బ్యూటీ ప్రాడక్ట్స్ వాడాలా అంటే అవసరం లేదు. మీరు వేస్ట్‌గా తిని పారేసే ఒక్క అరటి తొక్క చాలు.

2 / 5
అవును, అరటిపండు తొక్కలలో ఉండే పోషకాలు చర్మ సంరక్షణకు ఎంతగానో సహాయపడతాయి. వీటిలో పొటాషియం, యాంటీఆక్సిడెంట్ల వంటి గుణాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి అరటిపండు తొక్కలు నల్లటి వలయాలను తొలగించడంలో సహాయపడతాయి. మరి వీటిని ఎలా వాడాలో ఇక్కడ స్టెప్ బై స్టెప్ చూద్దాం.

3 / 5
మీరు అరటిపండు తొక్కను వాడేముందు మీ ముఖాన్ని శుభ్రంగా కడుక్కోండి. 10-15 నిమిషాల పాటు ఫ్రిజ్‌లో ఉంచిన అరటి తొక్కను తీసుకొని మీ కళ్ల కింద అప్లై చేయండి. 15 నిమిషాల పాటు వాటిని అలాగే వదిలేయండి. తర్వాత నీటితో ముఖాన్ని శుభ్రంగా కడుక్కోండి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేస్తే మీకు ఉత్తమ ఫలితాలు లభిస్తాయి.

4 / 5
మరో చిట్కా ఏమిటంటే.. ముందుగా ఒక అరటిపండు తొక్కను చిన్న ముక్కలుగా కట్ చేయండి. తర్వాత కొద్దిగా కలబంద జెల్ తీసుకొని.. అందులో అరటి తొక్క ముక్కలను కలిపి రెండింటినీ పేస్ట్‌లా రెడీ చేయండి. తర్వాత ఆ పేస్ట్‌ను మీ కళ్ల కింద అప్లై చేయండి. కాసేపు అలానే ఉంచి ఆ తర్వాత శుభ్రమైన నీటితో కడిగేయండి.

5 / 5
మరో పద్ధతి ఏమిటంటే.. అరటిపండు తొక్కలతో పేస్ట్ తయారు చేసి, దానికి కొద్దిగా నిమ్మరసం, తేనె యాడ్ చేసి మొత్తాన్ని మంచిగా పేస్ట్‌లా మిక్స్ చేయండి. ఈ పేస్ట్‌ను కళ్ల కింద అప్లై చేసి ఎనిమిది నుండి పది నిమిషాల పాటు అలాగే ఉంచి, ఆ తర్వాత నీటితో కడిగేయండి. ఈ పద్ధతి కళ్లను తేమగా ఉంచడమే కాకుండా, నల్లటి వలయాలను తొలగించడంలో కూడా సహాయపడుతుంది. Note: పైన పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్, నివేదికల ఆధారంగా మాత్రమే అందించబడినవి. వీటిని TV9 ధ్రువీకరించడం లేదు.

Loading...
Unable to load recommendations.
Follow Us