Sink Cleaning: అరెరే సింక్ నుంచి దుర్వాసన పోగొట్టడం ఇంత సింపులా.. ఇన్నాళ్లు తెలీదే..

Updated on: Nov 23, 2026 | 1:36 PM

ఇంట్లో ఆడవాళ్లకు చిరాకు తెప్పించే ప్రధాన సమస్య ఏదైనా ఉందంటే.. అది కిచెన్‌లో ఉండే సింక్. ఎందుకంటే దాన్ని ఎన్నిసార్లు క్లీన్ చేసినా దాని నుండి దుర్వాసన వస్తూనే ఉంటుంది. ఇది పూర్తి వంటగది వాతావరణాన్ని పాడు చేస్తుంది. ఆహారపు కణాలు, నూనె, డ్రెయిన్‌లో పేరుకుపోవడం వల్ల బ్యాక్టీరియా, మురికి ఇవన్నీ సింక్‌లో పేరుకుపోయి.. దుర్వాసనను వెదజల్లుతూ ఉంటాయి. అయితే ఖరీదైన రసాయనాలు లేకుండానే ఇంట్లో దొరికే వస్తువులతోనే ఈ సమస్యకు ఈజీగా చెక్ పెట్టవచ్చు. అదెలాగో చూద్దాం.

1 / 5
నిమ్మకాయ: దుర్వాసనను తరిమేయడంలో ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. అవును, ఇది సింకులో పేరుకుపోయిన సాల్మొనెల్లా, ఇ. కోలి  వంటి హానికరమైన బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. అలాగే ఇందులో ఉండే యాంటీ బాక్టీరియల్ గుణాలు సింకులోని బ్యాక్టీరియాను చంపి, దుర్వాసనలను తొలగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇది కాకుండా, నిమ్మ తొక్కలలోని సహజ సువాసన వంటగదిలోని అసహ్యకరమైన వాసనలను దూరం చేస్తుంది.

2 / 5
నిమ్మకాయ, ఉప్పు: ఈ మిశ్రమంతో కూడా సింక్‌లో ఉన్న దుర్వాసనకు ఈజీగా చెక్ పెట్టవచ్చు. ఇందుకోసం ఒక నిమ్మకాయను సగానికి కోసి, దానిపై ఉప్పు చల్లి, సింక్ ఉపరితలంపై బాగా రుద్దాలి. నిమ్మరసంలోని ఆమ్ల గుణం, ఉప్పులోని గరుకుదనం కలిసి మురికిని, మరకలను తొలగించి దుర్వాసనను దూరం చేస్తాయి. దీనివల్ల సింక్ నుండి మంచి వాసన రావడంతో పాటు కొత్తదానిలా మెరిసిపోతుంది అంతే.

3 / 5
నిమ్మరసం, ఈనో: సింక్‌ను క్లీన్ చేసేందుకు నిమ్మరసం, ఈనో కూడా చాలా బాగా పనిచేస్తాయి. వీటి మిశ్రమంతో సింక్ క్లీన్ చేయడానికి ముందుగా ఒక గిన్నెలో కొద్దిగా ఈనో పౌడర్‌ను వేసి, అందులో కొన్ని చుక్కల నిమ్మరసం కలపండి. ఆ తర్వాత, ఆ మిశ్రమాన్ని సింక్‌లో పోసి స్క్రబ్బర్‌తో మెల్లగా రుద్దండి. తర్వాత శుభ్రమైన నీరు పోసి కడిగేయండి. అంతే.. అప్పటివరకు మురికిగా, దుర్వాసనగా ఉన్న మీ సింక్ కొద్ది నిమిషాల్లోనే తళతళా మెరిసిపోతుంది.

4 / 5
వేడి నీరు: ఈ సింపుల్ చిట్కా గురించి చాలా మందికి తెలియదు. సింక్ రంధ్రంలో వేడి నీరు పోయడం వల్ల అందులో పేరుకుపోయిన నూనె, పాచి చాలా త్వరగా వదిలిపోతాయి. కాబట్టి వారానికి కనీసం ఒక్కసారైనా డ్రెయిన్‌లో వేడి నీటిని కచ్చితంగా పోయండి. ఈ వేడి నీరు నూనెను వదులు చేసి, దుర్వాసనకు కారణాన్ని తొలగిస్తుంది.

5 / 5
బేకింగ్ సోడా, వెనిగర్: ఈ మిశ్రమం కూడా సింక్ దుర్వాసనను చాలా త్వరగా దూరం చేస్తుంది. ఇందుకోసం ముందుగా సింక్, డ్రెయిన్‌ను తేలికగా శుభ్రం చేయాలి. తర్వాత అర కప్పు బేకింగ్ సోడాను సింక్‌లో పోసి, ఆపై అర కప్పు వెనిగర్ పోయాలి (లేదా రెండింటినీ కలిపి సింక్ అంతటా పోయాలి). తర్వాత 10-15 నిమిషాల పాటు అలానే వదిలేస్తే ఇది డ్రెయిన్‌లోని మురికిని, మలినాలను తొలగిస్తుంది. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరిస్తే సింక్ కొత్తదానిలా మారడంతో పాటు దుర్వాసన కూడా తొలగిపోతుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us