Akki Roti: కప్పు బియ్యపు పిండితో చేసే అరటి ఆకు అక్కి రొట్టె.. మెత్తగా, రుచిగా కాల్చే అసలైన పద్ధతి..

Updated on: Nov 19, 2026 | 8:41 AM

అరటి ఆకు అక్కి రొట్టె ఎంత ఫేమస్ అనేది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. దీనిని చేయడానికి బియ్యప్పిండి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యారెట్, జీలకర్ర కలిపి మెత్తని పిండిలా చేసుకుని ఆ తరవాత నూనె రాసిన అరటి ఆకుపై పిండిని పలుచగా ఒత్తి, పెనంపై వేసి రెండు వైపులా గోల్డ్ కలర్లో కాల్చుకుంటే టేస్టీ టేస్టీ రొట్టె రెడీ అవుతుంది.

1 / 5

2 / 5
కావాల్సిన పదార్దాలు:  బియ్యప్పిండి  2 కప్పులు, ఉల్లిపాయలు 2,  ఒక క్యారెట్  1 , పచ్చిమిర్చి 2 , ఒక టేబుల్ స్పూన్ అల్లం తరుగు,  ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, కొత్తిమీర,  కరివేపాకు,  2 టేబుల్ స్పూన్లు పచ్చి కొబ్బరి తురుము, రుచికి తగినంత ఉప్పు,  నూనె లేకపోతె నెయ్యిను కాల్చడానికి సరిపడా, అరటి ఆకులు రొట్టె కోసం 2  తాజా ఆకులు తీసుకోవాలి.

3 / 5
ముందుగా ఒక మీడియం సైజ్ గిన్నె తీసుకుని దానిలో కొద్దిగా బియ్యప్పిండి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం, జీలకర్ర, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి, కొత్తిమీర, నాలుగు కరివేపాకు, కొద్దిగా కొబ్బరి తురుము రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి. ఇప్పుడు దీనిని 
 కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని మరీ జోరుగా కాకుండా కలుపుకోండి.

ముందుగా ఒక మీడియం సైజ్ గిన్నె తీసుకుని దానిలో కొద్దిగా బియ్యప్పిండి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం, జీలకర్ర, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి, కొత్తిమీర, నాలుగు కరివేపాకు, కొద్దిగా కొబ్బరి తురుము రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి. ఇప్పుడు దీనిని కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని మరీ జోరుగా కాకుండా కలుపుకోండి.

4 / 5

ఇప్పుడు పిండి ఆరిపోకుండా ఒక తడి గుడ్డ కప్పి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అరటి ఆకును మంచిగా తుడిచి, దాని మీద కొంచం ఆయిల్ రాసుకోవాలి. ఇంకా మీ చేతులకు కొద్దిగా ఆయిల్ రాసుకుని నిమ్మకాయంత పిండిని తీసుకుని , అరటి ఆకుపై పెట్టి  నొక్కుతూ గుండ్రంగా ఒత్తుకోవాలి. ఇంకా ఈ రొట్టె బాగా కాలడానికి 2 చిన్న రంధ్రాలు చేసుకోవాలి.

5 / 5
ఇప్పుడు పెనంపై కాల్చుకోవాలి.  పెనం పొయ్యి మీద పెట్టి అది వేడయ్యాక నెయ్యి వేసి, ఈ  రొట్టె ఉన్న అరటి ఆకును పెనంపై పెట్టండి.  ఒక నిమిషం తర్వాత ఈ ఆకును  తీసివేయండి. ఇలా రెండు వైపులా కాల్చుకోవాలి. ఇంకా రంధ్రాలలో కొంచం ఆయిల్  వేసి సన్నని  మంటపై కాల్చండి. ఒక వైపు కాలిన తరవాత ఇంకో వైపు కాల్చుకోవాలి.

Loading...
Unable to load recommendations.
Follow Us