
కావలసిన పదార్థాలు: కాలిఫ్లవర్ పెద్దది, ఒక టీ స్పూన్ కారం, ఉప్పు రుచికి సరి పడినంత, రెండు టేబుల్ స్పూన్స్ ఆవాల పొడి, అర టీ స్పూన్ మెంతుల పొడి, 6 వెల్లుల్లి రెబ్బలు, రెండు టేబుల్ స్పూన్స్ నిమ్మరసం, రెండు టేబుల్ స్పూన్స్ నూనె, తాలింపు గింజలు తీసుకుకోవాలి.

కాలిఫ్లవర్ పచ్చడి ఎలా చేయాలంటే: ముందుగా కాలిఫ్లవర్ తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని వాటిని వేడినీటిలో ఉంచి ఆ తర్వాత వడ కట్టాలి.

ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని ఆరబెట్టిన కాలిఫ్లవర్ ముక్కలను తీసుకుని దానిలో రుచికి తగినంత ఉప్పు, అర టీ స్పూన్ కారం, అర టీ స్పూన్ ఆవపొడి, వెల్లుల్లి రెబ్బలు వేసుకుని బాగా కలుపుకోవాలి.

ఇప్పుడు పాన్ తీసుకుని దానిలో ఆయిల్ వేసి అది వేడయ్యాక దానిలో తాలింపు గింజలు , మినుములు, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసి తాలింపు పెట్టి చల్లారిన తర్వాత పచ్చడిలో కలుపుకోవాలి

ఇక చివర్లో రెండు టేబుల్ స్పూన్స్ నిమ్మరసం దానిలో వేసి ఒక సీసాలో పెట్టుకోవాలి. ఈ పచ్చడిని కదిలించకుండా రెండు మూడు రోజులు అలా ఉంచి ఆ తర్వాత వేడి వేడి అన్నంలో తింటే టేస్టీగా ఉంటుంది