
కావాల్సిన పదార్ధాలు: 500 గ్రాముల మటన్‌ను ఉల్లిపాయలు, ధనియాలు గరం మసాలాలు, ఒక కప్పు దోసకాయ ముక్కలు, ఉప్పు, పసుపు, ఉప్పు , ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక కప్పు పెరుగు, 3 టేబుల్ స్పూన్స్ నిమ్మరసం తీసుకోవాలి.

దోసకాయ మటన్ కూడా ఎలా చేయాలంటే: మటన్ తీసుకుని పసుపుతో శుభ్రం చేసి రుచికి తగినంత ఉప్పు, అర టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, ఒక టీ స్పూన్ కారం, కొద్దిగా పెరుగు/నిమ్మరసం పట్టించి 30 నిమిషాలు నానబెట్టాలి.

ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ ను పెట్టి దానిలో రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ చేసి దాచిన చెక్క, యాలకులు, లవంగాలు, కట్ చేసి ఉల్లిపాయ ముక్కలు, మిర్చి ముక్కలు వేసి బాగా వేయించాలి.

ఇప్పుడు దానిలో మటన్ వేసి ఆ మిశ్రమం ఉడికే వరకు బాగా వేయించాలి. దోసకాయ ముక్కలు, దానిలో రెండు గ్లాస్ లు నీళ్ళు పోసి, కుక్కర్ మూత పెట్టి 6 విజిల్స్ వచ్చే వరకు అలాగే ఉంచాలి.

మటన్, దోసకాయ ముక్కలు బాగా ఉడికిన తర్వాత దానిలో కొద్దిగా కొత్తిమీర, చికెన్ మాసాలాలు వేసి కిందకు దించేయాలి. అంతే వేడి వేడి మటన్ దోసకాయ కూర రెడీ.