
పొలం పచ్చడికి కావాల్సిన పదార్థాలు : నిమ్మకాయంత చింతపండు, నాలుగు పచ్చిమిర్చి , ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, నాలుగు వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు, అర కట్ట కొత్తిమీర తరుగు, అర టేబుల్ స్పూన్ జీలకర్రను తీసుకోవాలి.

ముందుగా పచ్చిమిర్చిని తీసుకుని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి. ఆ తర్వాత నిమ్మకాయంత చింతపండు తీసుకొని ఒక గిన్నెలో కొద్దిగా నీళ్లు పోసి నానబెట్టుకోవాలి.

నాలుగు వెల్లుల్లి రెబ్బలను తీసుకొని వాటిని ఉంచుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయను తీసుకుని కట్ చేసుకోవాలి. ఇప్పుడు రోటిలో కొద్దిగా జీలకర్రను వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకోవాలి.

ఇప్పుడు చింతపండును తీసుకుని దానిలో వేసి రుబ్బుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు కూడా వేయాలి. ఇప్పుడు ముందుగా పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను వేసి వాటిని బాగా దంచుకోవాలి.

చివర్లో ఉల్లిపాయ ముక్కలు దానిలో వేసి బాగా నూరుకోవాలి. కొత్తిమీరను కూడా వేసుకొని కలుపుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి. అంతే, రోటి పచ్చడి రెడీ. వేడివేడి అన్నంలో కొద్దిగా కలుపుకొని తింటే వావ్ టేస్ట్ అదిరిందని అనాల్సిందే.