సకినాలు గుడ్రంగా సన్నగా రావాలా.. ఈ టెక్నిక్ ఫాలో అవ్వండి!

Updated on: Oct 15, 2026 | 11:10 AM

తెలంగాణలో బతుకమ్మ, సంక్రాంతి పండుగ సమయాల్లో ఎక్కువగా పిండి వంటలు చేసుకుంటారు. గారెలు, జంతికలతో పాటు చాలా మంది సకినాలు తయారు చేస్తుంటారు. అయితే చాలా మందికి ఇవి తయారు చేయడం అంత పర్ ఫెక్ట్‌గా రాదు. కాబట్టి ఇప్పుడు మనం వాటిని చాలా సింపుల్‌గా ఎలా తయారు చేయాలో చూసేద్దాం.

1 / 5
సకినాలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాల్లోకి వెళ్లితే..:   దొడ్డు బియ్యం: 1 కేజీ,   మినపప్పు: 125 గ్రాములు ,   పుట్నాల పప్పు: 125 గ్రాములు,  తెల్ల నువ్వులు: 60 గ్రాములు,   వాము: 2 టీస్పూన్లు, ఉప్పు: రుచికి సరిపడా, నెయ్యి లేదా బట్టర్: 2-3 టీస్పూన్లు,  నూనె: వేయించడానికి సరిపడా,  నీళ్లు: పిండి కలపడానికి సరిపడా.

2 / 5
తయారీలోకి వెళ్లితే..  సన్నటి బియ్యం కాకుండా, దొడ్డు బియ్యాన్ని ఎంచుకోవాలి. బియ్యం ఎంత పాతవి అయితే సకినాలు అంత రుచిగా వస్తాయి. ఒక కేజీ బియ్యాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి, మళ్లీ నీళ్లు పోసి 10-12 గంటల పాటు బాగా నానబెట్టాలి. బియ్యం ఎంత బాగా నానితే సకినాలు అంత క్రిస్పీగా వస్తాయి. నానిన బియ్యంలోని నీళ్లను వడగట్టి, ఒక ఐదు పది నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తర్వాత ఒక శుభ్రమైన కాటన్ క్లాత్‌పై బియ్యం వేసి 10-15 నిమిషాలు ఆరబెట్టాలి. బియ్యం పూర్తిగా ఆరిపోకుండా, చేతికి తడి తగలకుండా ఉండేలా చూసుకోవాలి.

3 / 5
ఆరిన బియ్యాన్ని పిండి మిల్లులో లేదా ఇంట్లోనే మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసి జల్లించుకోవాలి. పిండి ఎంత మెత్తగా ఉంటే సకినాలు అంత బాగుంటాయి. స్టవ్ ఆన్ చేసి, ఒక పాన్‌లో అర కప్పు  మినప్పప్పును మీడియం ఫ్లేమ్‌లో మంచి వాసన వచ్చే వరకు వేయించి చల్లారనివ్వాలి. అదే విధంగా అర కప్పు పుట్నాల పప్పును కూడా తీసుకుని, చల్లారిన మినప్పప్పుతో కలిపి మెత్తని పిండిలా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పప్పుల పిండిని కూడా జల్లించి తీసుకోవాలి.

4 / 5
బియ్యంపిండిలో , పప్పుల మిశ్రం, నువ్వులు , వాము ఉప్పు , నెయ్యి వేసి మంచిగా కలుపుకోవాలి. తర్వాత పిండిని మెత్తని ముద్దలా తయారు చేసుకోవాలి. మరి గట్టిగా ఉండకూడదు. ఇప్పుడు పిండిని చేతిలోకి తీసుకొని సకినాల ఆకారంలో తయారు చేసుకోవాలి. అలా చేయడం రాకపోతే  మురుగుల గొట్టం తీసుకొని అందులో పిండి వేసి సకినాల ఆకారంలో చుట్టుకోవాలి.

5 / 5
 తయారు చేసిన సకినాలను ఒక ప్లేట్‌లో పేర్చి 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి. చేతికి తడి తగలకుండా ఆరితే వేయించడానికి సిద్ధంగా ఉన్నట్లు.  ఒక పెద్ద గరిటెకు కొద్దిగా నూనె రాసి, ఆరిన సకినాలను ఒక్కొక్కటిగా తీసుకుని వేడి నూనెలో వేయించాలి. మంచిగా కర కరం అనే వరకు సకినాలు కాల్చుకోవాలి. ఇవి మంచిది.

Loading...
Unable to load recommendations.
Follow Us