
ఉల్లిపాయల ముక్కలు వేయండి: మటన్ కూర వండేటప్పుడు ఉల్లిపాయలు చాలా ముఖ్యం. రెండు ఉల్లిపాయలను తీసుకుని వాటిని కట్ చేసుకుని గోల్డ్ కలర్లోకి మారే వరకు వాటిని బాగా వేయించాలి. ఇలా ఉల్లిపాయలు వేసిన తరవాత గ్రేవీగా అవుతాయి. దీని వల్ల కూర కూడా ఎక్కువ అవుతుంది. ఇంకా రుచి కూడా అదిరిపోతోంది. ఈ సారి ఇలా చేయండి.

రెండు రకాల కూరగాయలు వేయండి: మటన్‌తో పాటు బంగాళా దుంపలు, దోసకాయ వంటి వెజిటబుల్స్ వేస్తే కూర ఎక్కువగా కనిపిస్తుంది. అంతేకాదు, మటన్ దీనిని పీల్చుకుని మంచి రుచిని ఇస్తుంది. ముఖ్యంగా, బంగాళా దుంపలు అయితే మంచిది. మీరు కూడా వీటిని వేయడం మంచిది.

కొబ్బరి పేస్ట్‌తో కూరను పెంచండి: మటన్ ఉడికేటప్పుడు కొబ్బరి పేస్ట్, పల్లీలను వేస్తే కూర మంచి టేస్ట్ వస్తుంది. అంతేకాదు, ఇది గ్రేవీని ఇంకా పెంచుతుంది. ఇది కూరను ఎక్కువయ్యేలా చేస్తుంది. మీరు పావు కేజీ తెచ్చినా ముప్పావు కేజీ కూర చేయవచ్చు. పాత్రలో ఫుల్‌గా కనిపిస్తుంది.

నగపప్పు లేదా పెసరపప్పును వేయండి: మటన్ ఉడికేటప్పుడు ఒక కప్పు నానబెట్టిన శనగపప్పు లేదా పెసరపప్పు వేస్తే కూర ఎక్కువగా అవుతుంది. ఇది బాగా ఉడికిన తర్వాత గ్రేవీతో మారుతుంది. దీని వలన కూర గట్టిగా, చాలా ఎక్కువగా అవుతుంది. ఇంకా దీనిలో పోషకాలు కూడా ఉంటాయి. మీరు కూడా ఈ సారి దీనిలో వేయండి.

టమోటాలు, మసాలా పొడి: మటన్ ఉడికేటప్పుడు ఒక కప్పు టమోటా ముక్కలు వేసి మెత్తగా అయ్యే వరకు ఉంచాలి. ఇవి వేసాక కూర గ్రేవీగా మారుతుందికర్రీ కూడా మంచి టేస్ట్ ఉంటుంది. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలాలు కూడా దీనిలో వేస్తె కూర రిచ్‌గా ఉంటుంది. దీనిలోనే మంచి రుచి కూడా వస్తుంది.