మిలాద్ ఉన్ నబీ స్పెషల్.. ఖీర్ పూరీ సింపుల్‌గా ఎలా చేయాలో తెలుసా?

Updated on: Aug 26, 2026 | 3:29 PM

మిలాద్ ఉన్ నబీ పండుగ రోజు తప్పక చేసుకునే వంటల్లో ఖీర్ పూరీ ఒకటి. అయితే దీనిని చాలా రుచికరంగా, సింపుల్‌గా ఇంటిలోనే త్వరగా ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం వివరంగా చూద్దాం. ఇలా చేస్తే, ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా ఈ స్వీట్‌ను తింటారంట.

1 / 5
 కావాల్సిన పదార్థాలు : కప్పు బియ్యం, బాదం, జీడిపప్పు, లీటర్ పాలు, కుంకుమ పువ్వు, డ్రై ఫ్రూట్స్, గోధుమ పిండి, స్పూన్ రవ్వ, చిటికెడు ఉప్పు, నెయ్యి, చక్కెర.

2 / 5
తయారీలోకి వెళితే.. ముందుగా, ఒక పావు కప్పు బియ్యాన్ని రెండు, మూడు సార్లు శుభ్రంగా కడగాలి. ఇందులోనే నాలుగు బాదం పప్పులు, కొన్ని జీడిపప్పు పలుకులు వేసి, త్వరగా నానడానికి గోరువెచ్చని నీళ్లు పోసి పది నిమిషాల పాటు మూతపెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి, పాన్ పెట్టి అందులో పాలు పోసి, చిన్న గ్లా్స్‌లో సగం వాటర్ పాలల్లో పోసి మంచిగా మరిగించుకోవాలి.

3 / 5
ఇక పాలు మరిగేలోపు. మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం తీసుకొని, మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా కాకుండా కాస్త బరగా గ్రైండ్ చేసుకోవాలి. దీని వ లన పాయసం చాలా చిక్కగా రుచికరంగా ఉంటుంది. ఇక పాలు బాగా మరుగుతుంటే, మీరు మిక్సీ పట్టుకున్న ఈ బియ్యం పేసస్ట్ అందులో వేయాలి. మధ్య మధ్యలో కలుపుతూ మంచిగా ఉడికించుకోవాలి.

4 / 5
అలాగే మంచి రంగు, రుచి కోసం కొద్దిగా కుకుమ పువ్వు, జీడిపప్పు, బాదం, రుచి కోసం వేసుకొని గడ్డలు లేకుండా ఖీర్ మంచిగా, మెత్తగా ఉడికేలా చూసుకోవాలి. అలాగే తియ్యగా ఉండానికి సరిపడ చక్కెర వేస మంచిగా కలుపుతూ ఉండాలి. పాయసం కాస్త చిక్కబడిన తర్వాత స్పూన్ యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. అంతే రుచికరమైన ఖీర్ రెడీ, ఇప్పుడు పూరీలు ప్రిపేర్ చేసుకోవాలి.

5 / 5
ఇప్పుడు పూరీల కోసం గోధుమ పిండి తీసుకోండి. అందులో స్పూన్ బొంబాయి రవ్వ, ఉప్పు వేసి బాగా కలుపుకోండి. తర్వాత నీరు పోసి మెత్తగా కలుపుకోవాలి. తర్వాత పిండితో చిన్న చిన్న పూరీలు తయార చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి, అందులో సరిపడ నూనె వేసి, బంగారు రంగు వచ్చే వరకు కాల్చుకోవాలి. అంతే పూరీ రెడీ. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఖీర్‌తో కలిపి తింటే రుచి అద్భుంగా ఉంటుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us