
కావాల్సిన పదార్ధాలు : బోన్‌లెస్ మటన్ ముక్కలు, ఒక టేబుల్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక కప్పు శనగపిండి , నూనెను తీసుకోవాలి.

ముందుగా మెత్తని మటన్ ముక్కలను తీసుకుని పసుపుతో శుభ్రపరచుకోవాలి. దానిలో ఒక టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, అర టీ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ప్రెజర్ కుక్కర్ ను 5 విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించాలి.

ఉడికించిన మటన్ ముక్కలలో కొంచం కూడా నీరు లేకుండా చేసుకోవాలి. ఆ తర్వాత వీటికి ఒక టేబుల్ స్పూన్ కారం, అర టీ స్పూన్ గరం మసాలా, అర టీ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా నిమ్మరసం కలుపుకోవాలి.

ఇప్పుడు వాటిలో శనగపిండి, ఒక కప్పు బియ్యపు పిండి, కరివేపాకు ఆకులు, కొత్తిమీర అర కట్ట వేసి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. అవసరమైతే వాటిలో నీళ్ళు కలుపుకోండి.

స్టవ్ వెలిగించి పాన్ లో ఆయిల్ వేసి, పిండి పట్టించిన మటన్ ముక్కలను తీసుకుని నూనెలో బాగా వేయించుకోవాలి. అంతే, వేడి వేడి మటన్ పకోడీ రెడీ