కప్పు పెసర పప్పు, రెండు టమాటాలతో ఇలా చేసి తింటే కడుపుకి తేలిగ్గా ఒంటికి చలువచేసేలా..

Updated on: Jul 12, 2026 | 4:19 PM

ఎప్పుడూ రొటీన్ కూరలు ఏం తింటారు. ఈ సారి కొత్తగా ఇలా ట్రై చేయండి. నోటికి మంచి రుచి ఉంటుంది. ఒక కప్పు పెసర పప్పు చాలు. వానల్లో శరీరానికి బలం కూడా. మరి అస్సలు ఆలస్యం లేకుండా దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చదివి తెలుసుకుందాం..

1 / 5
పెసరపప్పు రెసిపీకి కావలసిన పదార్థాలు: ఒక కప్పు పెసరపప్పు, 4 టమాటాలు , ఒక పెద్ద ఉల్లిపాయ, 10 పచ్చిమిర్చి, పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా నీరు,  రెండు టేబుల్ స్పూన్స్ నూనె , ఒక టేబుల్ స్పూన్ ఆవాలు,  ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, 9 వెల్లుల్లి రెబ్బలు, రెండు ఎండుమిర్చి , రెండు కరివేపాకు రెబ్బలు, కొద్దిగా ఇంగువ, కొద్దిగా కొత్తిమీరను తీసుకోవాలి.

2 / 5

పెసర పప్పు తయారీ విధానం: ముందుగా పెసర్లను తీసుకుని ఒకటికి రెండు సార్లు బాగా కడిగి ఉడికించుకోవాలి.  ఆ తర్వాత  కుక్కర్‌లో వేయాలి 10 నిముషాలు పొయ్యి మీదే పెట్టుకోవాలి. ఇంకా దీనిలో టమాటా ముక్కలు, కట్ చేసిన ఉల్లిపాయ, 10 పచ్చిమిర్చి, అర టేబుల్ స్పూన్ పసుపు,  రెండు కప్పుల నీరు వేసి దీనిని మిక్స్ అయ్యేలా  కలపాలి.

3 / 5

పెసర పప్పు తయారీ విధానం స్టెప్ 1 : 4 విజిల్స్ వచ్చే వరకు దీనిని బాగా ఉడికించాలి. ఆ తరవాత దీనిని కిందకి దించి  పప్పు మెత్తగా కలుపుకోవాలి. ఆ తర్వాత దీనిని పక్కన పెట్టి దీనిలో ఉప్పు వేసి అవసరమైతే ఇంకా నీళ్లు కూడా  5 నిమిషాల పాటు దీనిని చక్కగా  మరిగించాలి. ఇలా చేస్తే ఇది మంచి రుచిగా ఉంటుంది.

4 / 5
పెసర పప్పు తయారీ విధానం స్టెప్ 2 :  ఇక ఇప్పుడు పాన్‌లో కొద్దిగా నూనె కానీ నెయ్యి  వేసి దీనిని బాగా వేడి చేయాలి. కొద్దిగా వేడి అయ్యాక అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేయాలి. నాలుగు వెల్లుల్లి, నాలుగు ఎండుమిర్చి, నాలుగు కరివేపాకు, ఇంకా ఇంగువ వేసి గోల్డ్ కలర్లోకి మారే  వరకు దీనిని  బాగా వేయించాలి.

5 / 5
ఈ పోపును తీసుకుని పప్పులో వేసి దీనిని మంచిగా కలపాలి. ఇంకా దీనిలో కొద్దిగా కొత్తిమీర కూడా  చల్లి మరో 5 నిమిషాలు పాటు దీనిని  పొయ్యి మీద ఉంచి కిందకు దించేయాలి. ఈ పెసరపప్పు పప్పును వేడి వేడి అన్నంలో తింటే ఆ రుచే వేరు. రాగి సంగటి
జొన్న రొట్టె, చపాతీతోల్లోకి కూడా ఎంతో టేస్టీగా ఉంటుంది.

ఈ పోపును తీసుకుని పప్పులో వేసి దీనిని మంచిగా కలపాలి. ఇంకా దీనిలో కొద్దిగా కొత్తిమీర కూడా చల్లి మరో 5 నిమిషాలు పాటు దీనిని పొయ్యి మీద ఉంచి కిందకు దించేయాలి. ఈ పెసరపప్పు పప్పును వేడి వేడి అన్నంలో తింటే ఆ రుచే వేరు. రాగి సంగటి జొన్న రొట్టె, చపాతీతోల్లోకి కూడా ఎంతో టేస్టీగా ఉంటుంది.

Follow Us