
ఎండు మాంసం కూరను అన్నం, చపాతీల్లో వేసుకుని తింటారు. బాలింతలకు ఇది సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు. మరి, ఇంకెందుకు లేట్ తెలుగు రాష్ట్రాల్లో అందరూ ఇష్ట పడే ఈ కూరను ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..

కావాల్సిన పదార్ధాలు : పావు కిలో ఎండు మాంసం (మటన్), చిన్న ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్స్ కారం, అర టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్స్ నూనె, 2 టేబుల్ స్పూన్స్ చింతపండు తీసుకోవాలి.

ముందుగా ఎండు మాంసం ముక్కలను శుభ్రపరిచి, వాటిని వేడి నీటిలో 10 నిముషాల పాటు ఉంచాలి. ఇలా చేయడం వలన అవి తినడానికి మెత్తగా అవుతాయి

ఇక ఇప్పుడు పాన్ లో ఆయిల్ వేసి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి రంగు మారే వరకు బాగా వేయించాలి.

ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, నానబెట్టిన ఎండు మాంసం ముక్కలు వేసి 5 నిముషాల పాటు వేయించాలి. కొద్దీ సేపటికి కారం, రుచికి సరి పడినంత ఉప్పు వేయాలి. అంతే, ఎండు మాంసం కూర రెడీ.