పాలకూర అంటే ముఖం తిప్పుకునే వారు కూడా లొట్టలేసుకుని తినే అద్భుతమైన ఆలూ పాలక్ కర్రీ!

Updated on: Aug 15, 2026 | 8:00 AM

 రోజూ ఇంట్లో కూరలు ఏం చేయాలో పాలుపోక తలపట్టుకుంటుంటాం. ముఖ్యంగా పిల్లలకి ఆకుకూరలు పెట్టాలంటే పెద్ద యుద్ధమే చేయాల్సి వస్తుంది. ఎన్నో పోషకాలున్న పాలకూరను వండితే చాలామంది ఇష్టపడరు. కానీ, అదే పాలకూరను బంగాళాదుంపలతో కలిపి కాస్త స్పెషల్ గా వండితే మాత్రం ఇంట్లో ప్లేట్లు క్షణాల్లో ఖాళీ అయిపోతాయి.

1 / 5
వేడివేడి అన్నంలోకి గానీ, మెత్తని చపాతీల్లోకి గానీ అద్భుతంగా సరిపోయే నోరూరించే ఆలూ పాలక్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: రెండు కట్టల తాజా పాలకూర, ఐదు మీడియం సైజు బంగాళాదుంపలు, రెండు ఉల్లిపాయలు, రెండు టమాటాలు, ఒక వెల్లుల్లి గడ్డ, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర, కరివేపాకు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, ఉప్పు, నూనె మరియు కొత్తిమీర.

2 / 5
తయారీ విధానం: ముందుగా పాలకూరను బాగా కడిగి, ముదురు కాడలను తీసేసి సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే బంగాళాదుంపల పొట్టు తీసి చిన్న ముక్కలుగా కోసి ఉప్పు నీళ్లలో వేయాలి. ఇలా చేయడం వల్ల ముక్కలు నల్లబడకుండా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టి రెండు స్పూన్ల నూనె వేసి వేడిచేయాలి. అందులో పొట్టు వలిచిన వెల్లుల్లి రెబ్బలు వేసి కొద్దిగా వేగాక, తరిగిన పాలకూరను వేసి కలపాలి. మూతపెట్టి మీడియం మంటపై నాలుగు నుంచి ఐదు నిమిషాలు మగ్గనిచ్చి పక్కన పెట్టుకోవాలి.

3 / 5
మరో కడాయిలో మూడు స్పూన్ల నూనె పోసి వేడయ్యాక బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు వేసి చిటపటలాడనివ్వాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. ఉల్లిపాయలు వేగాక అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చివాసన పోయేంతవరకు వేపాలి. ఇప్పుడు కోసి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి నూనెలోనే కాసేపు బాగా మగ్గనివ్వాలి. దుంపలు సగం ఉడికిన తర్వాత టమాటా ముక్కలు వేసి మెత్తబడేవరకు మూతపెట్టాలి.

4 / 5
టమాటాలు మెత్తగా మగ్గిన తర్వాత కారం, ధనియాల పొడి, గరం మసాలా, చిటికెడు పసుపు వేసి బాగా కలపాలి. మసాలాలు మాడిపోకుండా కొద్దిగా నీళ్లు చల్లి నూనె పైకి తేలేవరకు వేయించాలి. ఆ తర్వాత గ్రేవీకి సరిపడా నీళ్లు, రుచికి తగినంత ఉప్పు వేసి బాగా మరగనివ్వాలి. ఎసరు బాగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పాలకూర, వెల్లుల్లి మిశ్రమాన్ని ఇందులో వేసి కలపాలి.

5 / 5
కూరను రెండు నిమిషాలు చిన్న మంటపై ఉడకనిస్తే మసాలాలన్నీ పాలకూరకు, ఆలూ ముక్కలకు పట్టి అద్భుతమైన వాసన వస్తుంది. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీరను చల్లుకుని స్టవ్ ఆపేయాలి. ఈ విధంగా చేసిన ఆలూ పాలక్ కర్రీ గుమగుమలాడుతూ ఎంతో రుచిగా ఉంటుంది. పాలకూర ఇష్టపడని వారు కూడా ఈ కూరను మళ్లీ మళ్లీ చేయమని అడుగుతారు. మీరు కూడా ఈ పద్ధతిలో తప్పకుండా ట్రై చేసి ఇంట్లో అందరి ప్రశంసలు అందుకోండి!

Loading...
Unable to load recommendations.
Follow Us