ఇది అల్లాటప్పా కూర కాదండి.. బిర్యానీని తలదన్నేరెసిపీ.. ఒక్కసారి తింటే అస్సలు వదిలిపెట్టరు

Updated on: Mar 17, 2026 | 1:50 PM

ఈ సూపర్ టేస్టీ కర్రీ ఒక్కసారి మీ ఇంట్లో చేస్తే అందరూ ఇష్టపడతారు. రుచి కూడా అదిరిపోతోంది. ఇది అల్లాటప్పా కూర కాదండి.. బిర్యానీని కూడా దీని ముందు తక్కువే ఒక్కసారి మీ ఇంట్లో చేసి తింటే అస్సలు వదిలిపెట్టరు. మరి, ఇంకెందుకు లేట్ ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం..

1 / 5
కావాల్సిన పదార్ధాలు : పావుకిలో మష్రూమ్స్ , రెండు కప్పులు దోసకాయ ముక్కలు , ఒక పెద్ద ఉల్లిపాయ,  6 పచ్చిమిర్చి, పసుపు, రుచికి తగినంత ఉప్పు, పోపు గింజలు, అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర,  ఎండుమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, ఒక టీ స్పూన్ కారం, ఒక చిన్న గ్లాస్ నూనెను తీసుకోవాలి.

2 / 5
ముందుగా  దోసకాయను తీసుకుని నీటిలో శుభ్ర పరచి, వాటిని ముక్కలుగా చేసి, పచ్చిమిర్చి వేసి, ఒక గ్లాస్ నీళ్లు పోసి వాటిని బాగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి.

3 / 5
ఇప్పుడు గ్యాస్ వెలిగించి పాన్‌లో నూనె వేసి తాలింపు గింజలు కూడా బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు , ఒక టీ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి బంగారు రంగులోకి మారే వరకు బాగా వేయించుకోవాలి.

4 / 5
ఇక ఇప్పుడు కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న పుట్టగొడుగులను ఒక పాత్రలో వేసి కొద్దిగా పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసి వాటిని బాగా ఉడకనివ్వాలి. నీరు మొత్తం బయటకు వచ్చే దాకా అలాగే ఉడకనివ్వండి.

5 / 5
పుట్టగొడుగులు బాగా ఉడికిన తర్వాత ఒక టేబుల్ స్పూన్  కారం, ముందుగా సిద్ధం చేసిన పెట్టుకున్న దోసకాయ ముక్కలు, మసాలా పొడులు వేసి మిక్స్ అయ్యేలా కలుపుకోండి. ఆ తర్వాత రెండు గ్లాస్ లు నీళ్లు పోసి 5  నిమిషాల స్టవ్ మీదే ఉంచి ఉడికించండి. దించే ముందు కొత్తిమీర వేసి అన్నంలో వేసుకుని తినడమే.

Follow Us