
ఇంట్లో మొక్కలు పెంచడం ఒక సవాల్ అనే చెప్పాలి. విత్తనాలు నాటిన కూడా మొలకెత్తుతాయని గ్యారెంటి లేదు, ఇంకా కొన్ని మొలకెత్తిన కూడా కొద్ది రోజుల్లోనే వాడిపోతుంటాయి. అయితే, ఇక్కడ కొత్తిమీరను ఎలా పెంచితే కట్టలు కట్టలుగా వస్తాయో ఇక్కడ ఆర్టికల్లో చదివి తెలుసుకుందాం

ముందుగా మంచి ధనియాలను తీసుకుని వాటిని ఒకటికి రెండు సార్లు చెక్ చేయాలి. నకిలీ విత్తనాలు అయితే తొందరగా మొలకెత్తవు, కాబట్టి, మీ ఇంట్లో ఉన్న ధనియాలను తీసుకుని రోకలి బండతో రెండు మూడు సార్లు దంచండి. అప్పుడు అది రెండు ముక్కలు అవుతుంది.

మీరు తీసుకునే మట్టిలో నైట్రోజన్ ఉండేలా చూసుకోవాలి. ఇంకా చెప్పాలంటే ఎరువు ఉన్నది అయితే బెటర్. ఆకుకూరల కోసం ఇది చాలా మంచిది. ఇవి పెరిగినా మొక్కలు కిందకు పడిపోకుండా చూసుకుంటుంది. ఒక మట్టి కుండలో మీరు తీసుకున్న మట్టిని తీసుకోండి.

మీరు విత్తనాలు వేసే ముందు మట్టిని తేమగా ఉండేలా చూసుకోవాలి దీనికోసం తడిపి పెట్టుకోవాలి. మట్టి పొడిగా ఉంటే విత్తనాలు త్వరగా మొలకెత్తవు. నీరు పోయగానే కిందకు వెళ్ళేలా ఉండాలి. తడిపిన మట్టిలో మీరు తీసుకున్న ధనియాలు వేస్తే కొత్తిమీర కట్టలు కట్టలుగా వస్తాయి.

మొలకలు వచ్చే వరకు తడిగా ఉండేలా చూసుకోవాలి. ఇంకా ఉల్లి పాయలు పొట్టు, టీ పొడి వేస్తే కొత్తిమీర బాగా వస్తుంది. పైన చెప్పినవన్నీ పాటిస్తే కొద్దీ రోజుల్లోనే మీరు మార్కెట్ కూడా వేయవచ్చు. ఇంకా కొత్తిమీరతో కనక వర్షం కురిపించవచ్చు.