
ప్రస్తుతం రోజుల్లో చాలా మంది ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారు. వీరికి గవర్నమెంట్ ఎంప్లాయిస్‌లా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉండవు కాబట్టి. చిన్న వయస్సులోనే వీరు సేవింగ్స్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. దీనికి SIP మంచి మార్గం అవుతుంది. దీని ద్వారా క్రమంగా పెట్టుబడి పెట్టి, ఆ తర్వాత SWP ద్వారా మీ పెట్టుబడి నుంచే మీరు పెన్షన్ రూపంలో నెల నెలా డబ్బును తీసుకోవచ్చు. దీని ద్వారా ఫ్యూచర్‌లో మీరు పనిచేయలేని స్థితిలో ఉన్నప్పుడు ఇది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

మీరు చిన్న ఏజ్‌లోనే పెట్టుబడి పెట్టడం ద్వారా దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో డబ్బును పొందవచ్చు. ఉదాహరణకు, ఒక వ్యక్తి తన 25 ఏళ్ల వయసులో నెలకు రూ. 10,000 పెట్టుబడి పెట్టడం ప్రారంభింస్తే.. అతను ప్రతి సంవత్సరం ఈ మొత్తాన్ని 10శాతం పెంచుకుంటూ పోతే, ఆ పద్ధతిని 'స్టెప్-అప్ ఎస్‌ఐపి అంటారు. ఇలా మీరు 20 ఏళ్ల పాటు కొనసాగిస్తే దానికి మీకు 15శాతం రిటర్న్స్ వస్తే.. ఈ మొత్తం సుమారు రూ. 2.5 కోట్లకు చేరుకుంటుంది.

ఈ రూ. 2.5 కోట్ల మొత్తాన్ని మీరు రిటైర్మెంట్ అయిన తర్వాత SWP ద్వారా తిరిగి పొందవచ్చు. అంటే మీరు ప్రతి నెల ఒక నిర్దిష్ట మొత్తాన్ని వెనక్కి తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఉదాహరణకు మీరు ప్రతి నెల సుమారు రూ. 2 లక్షలు విత్‌డ్రా చేసుకుంటూ, మిగిలిన డబ్బుపై సగటున 8% రాబడిని పొందితే, ఈ పద్ధతి సుమారు 20 సంవత్సరాల పాటు కొనసాగుతుంది. ఈ 20 ఏళ్ల తర్వాత కూడా మీ దగ్గర ఇంకా రూ. 4.5 లక్షలు మిగిలి ఉంటుంది.

మీరు విత్‌డ్రా చేసుకునే మొత్తాన్ని కావాలంటే పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. ఇక్కడ SWPకు ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, ఇది ప్రతి నెల స్థిరమైన ఆదాయాన్ని అందిస్తుంది. అలాగే, వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా విత్‌డ్రా మొత్తాన్ని మార్చుకునే వీలుంటుంది. కాబట్టి ఇది మీకు స్టేబుల్ ఆదాయాన్ని సమకూరుస్తుంది.

అయితే మీరు SIP పెట్టేప్పుడు రాబడి గురించి క్లారిటీగా తెలుసుకోండి ఎందుకంటే SIPల నుండి వచ్చే రాబడి మార్కెట్ పై ఆధారపడి ఉంటుంది. కాబట్టి అవి హెచ్చుతగ్గులకు లోనవుతాయి. మార్కెట్ పరిస్థితులు సంభావ్య రాబడిని మార్చవచ్చు, దీనివల్ల రాబడి తగ్గే అవకాశం కూడా ఉంది. పెట్టుబడి పెట్టే ముందు ఇది గమనించగలరు.