కొబ్బరికాయను ఎలా పగలగొట్టాలి..? ఎవరూ చెప్పని వంటింటి ట్రిక్స్ ఇవే..

Updated on: Aug 29, 2026 | 10:10 AM

భారతీయ వంటకాల్లో కొబ్బరి పాత్ర ఎంత కీలకమో.. దాన్ని కొట్టి, చిప్ప నుంచి గుజ్జును వేరు చేయడం అంతటి కష్టం. చేతికి దెబ్బలు తగులుతాయేమోనన్న భయం ఉన్నా ఇకపై టెన్షన్ పడాల్సిన పనే లేదు. వంటింట్లో లభించే చిన్న చిన్న వస్తువులతోనే క్షణాల్లో కొబ్బరికాయను వెన్నలా ఎలా పగలగొట్టవచ్చో తెలిపే 5 సింపుల్ ట్రిక్స్ ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
డీప్ ఫ్రీజర్ ట్రిక్: కొబ్బరికాయ పెంకు సులభంగా ఊడిరావడానికి ఫ్రిజ్ ఒక అద్భుతమైన మార్గం. కొబ్బరికాయను రాత్రంతా డీప్ ఫ్రీజర్‌లో ఉంచాలి. బాగా గడ్డకట్టిన తర్వాత బయటకు తీసి, వంటగది స్లాబ్ లేదా గట్టి నేలపై నెమ్మదిగా కొన్నిసార్లు తడితే చాలు. తీవ్రమైన చల్లదనానికి పెంకు పెళుసుగా మారి వాటంతట అదే పగిలి గుజ్జు సులభంగా విడిపోతుంది.

2 / 5
గ్యాస్ స్టవ్ వేడి పద్ధతి: ముందుగా కొబ్బరికాయలోని నీటిని పూర్తిగా తీసేయాలి. అనంతరం గ్యాస్ స్టవ్ వెలిగించి, మధ్యస్థ మంటపై కొబ్బరికాయను ఫోర్క్ లేదా పట్టుకారు సాయంతో 2 నుంచి 3 నిమిషాల పాటు అన్నివైపులా తిప్పుతూ వేడి చేయాలి. మంట వేడికి లోపల ఏర్పడే ఆవిరి ఒత్తిడి వల్ల బయటి గట్టి చిప్ప వ్యాకోచించి పగుళ్లు ఏర్పడతాయి. దీంతో పెంకు చాలా తేలికగా ఊడివస్తుంది.

3 / 5
రంధ్రం ద్వారా నీటి ఒత్తిడి తగ్గించడం: ప్రతి కొబ్బరికాయకు పైన మూడు నల్లటి గుర్తులు ఉంటాయి. వాటిలో ఒకటి చాలా మెత్తగా ఉంటుంది. స్క్రూడ్రైవర్ లేదా ఏదైనా మొనదేలిన వస్తువుతో ఆ మెత్తటి రంధ్రం గుండా రంధ్రం చేసి లోపలి నీరంతా ఒక గిన్నెలోకి వంపేయాలి. లోపల తేమ, నీటి పీడనం తగ్గడం వల్ల కొబ్బరికాయ నిర్మాణంలో బలం తగ్గుతుంది. ఆ తర్వాత కొబ్బరికాయను తేలికగా నేలపై తట్టినా అది రెండు ముక్కలుగా విడిపోతుంది.

4 / 5
కాటన్ క్లాత్ లేదా ప్లాస్టిక్ కవర్ డ్రాప్: కొబ్బరికాయను కొట్టేటప్పుడు ముక్కలు, నీరు ఇల్లంతా చిందరవందర కాకుండా ఉండాలంటే ఈ పద్ధతి ఉత్తమం. కొబ్బరికాయను ఒక కాటన్ గుడ్డలో లేదా మందపాటి ప్లాస్టిక్ కవర్‌లో గట్టిగా చుట్టాలి. ఆ తర్వాత కాంక్రీట్ నేల లేదా బండరాయిపై కొద్ది ఎత్తు నుంచి బలంగా వేస్తే ఆ దెబ్బకు చిప్ప లోపలే చక్కగా పగిలిపోతుంది. ముక్కలు కూడా బయట పడకుండా ఒకేచోట ఉంటాయి.

5 / 5
మొద్దుబారిన కత్తితో సెంటర్ లైన్ ట్రిక్: నీరు తీసేసిన కొబ్బరికాయ మధ్య భాగాన్ని గమనిస్తే ఒక సహజమైన గీత కనిపిస్తుంది. ఒక మొద్దుబారిన కత్తిని తీసుకుని ఆ మధ్య గీత వెంబడి చుట్టూ సమానంగా కొన్ని దెబ్బలు కొట్టాలి. ఇలా చుట్టూ కొడుతుంటే పెంకుపై సమానమైన ఒత్తిడి పడి కొబ్బరికాయ కచ్చితంగా సమానమైన రెండు భాగాలుగా విడిపోతుంది. చేతులకు ఎలాంటి గాయాలు కాకుండా సురక్షితంగా కొబ్బరికాయను పగలగొట్టడానికి ఈ చిట్కాలు ఎంతగానో ఉపయోగపడతాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us