ఒక్క తేనెటీగ చనిపోయేలోపు ఎంత తేనెను తయారు చేస్తుందో తెలుసా? మీకు తెలియని ప్రకృతి రహస్యాలు..

Updated on: Jul 31, 2026 | 3:30 PM

ఆకాశంలో స్వేచ్ఛగా ఎగురుతూ, పూలను చుట్టొచ్చే ఒక చిన్న తేనెటీగను చూస్తే మనకి పెద్దగా ఏమీ అనిపించకపోవచ్చు. కానీ ప్రకృతి ప్రసాదించిన అత్యంత అద్భుతమైన, సంక్లిష్టమైన జీవుల్లో ఇవి ఒకటి. మానవ సాంకేతికత ఇంకా అభివృద్ధి చెందని కాలంలోనే తేనెటీగలు దిశలను కనుగొనడం, కమ్యూనికేట్ చేయడం, ఒక క్రమశిక్షణ కలిగిన వ్యవస్థను నడపడం నేర్చుకున్నాయి. మనం నిత్యం చూసే తేనెటీగల వెనుక ఉన్న లోతైన శాస్త్రీయ నిజాలు చాలా మందికి తెలియవు.

1 / 5
నావిగేషన్ అద్భుతం:  మనం తెలియని ప్రాంతానికి వెళ్తే దారి కోసం స్మార్ట్‌ఫోన్‌లోని లోకేషన్ ఉపయోగిస్తాం. కానీ తేనెటీగలు వేల సంవత్సరాలుగా తమ సొంత నావిగేషన్ సిస్టమ్‌ను ఉపయోగిస్తున్నాయి. మేఘాలు కమ్మేసినా, సూర్యుడు ప్రత్యక్షంగా కనిపించకపోయినా వెలుతురును బట్టి సూర్యుడి స్థానాన్ని అవి ఖచ్చితంగా లెక్కించగలవు. తేనెటీగల శరీరంలో అయస్కాంత రేణువులు ఉంటాయి. వీటి ద్వారా అవి భూమి అయస్కాంత దిశలను పసిగట్టి, మైళ్ల దూరం ఆహారం కోసం వెళ్లినా తిరిగి తమ గూటికే కచ్చితంగా చేరుకుంటాయి.

2 / 5
చుక్క తేనె వెనక ఎంత కష్టమో: తేనె సీసాను తెరిచి ఒక చెంచా తేనెను నోట్లో వేసుకోవడం మనకు కొద్ది సెకన్ల పనే. కానీ దాని తయారీ వెనుక ఉండే పరిణామం అపారమైనది. ఒక తేనెటీగ తన జీవితకాలం మొత్తంలో సేకరించి తయారుచేసే తేనె పరిమాణం కేవలం 1/12 టీస్పూన్ మాత్రమే. కేవలం అరకిలో తేనె తయారు కావడానికి తేనెటీగలు దాదాపు 20 లక్షల పువ్వులను సందర్శించాలి. దీనికోసం అవి దాదాపు 90,000 మైళ్లు ప్రయాణిస్తాయి. అంటే ఒక బాటిల్ తేనె మన ముందుకు రావడానికి వేలాది తేనెటీగల రాత్రింబవళ్ల సమష్టి కష్టం దాగి ఉంది.

3 / 5
వాగుల్ డ్యాన్స్: తేనెటీగలకు మాటలు రావు, కానీ అవి తోటి జీవులతో చాలా ప్రభావవంతంగా మాట్లాడగలవు. అందుకోసం అవి చేసే ప్రత్యేక నృత్యమే వాగుల్ డ్యాన్స్. ఆహారం లభించిన ప్రదేశం నుంచి గూటికి తిరిగి వచ్చిన తేనెటీగ, గూటిపై 8 ఆకారంలో తిరుగుతూ డ్యాన్స్ చేస్తుంది. ఈ నాట్యం చేసే వేగం, దిశ, శరీర చలనాన్ని బట్టి ఆహారం ఏ దిశలో ఉంది? ఎంత దూరంలో ఉంది? ఎంత పరిమాణంలో ఉందో తోటి తేనెటీగలు కచ్చితంగా అర్థం చేసుకుంటాయి. సైన్స్ ప్రపంచంలో ఇది అత్యంత సంక్లిష్టమైన ప్రాణి కమ్యూనికేషన్ సిస్టమ్‌గా నిలిచింది.

4 / 5
మానవ కంటికి అందని సూపర్‌విజన్: మనుషుల కళ్లకు, తేనెటీగల కళ్లకు చాలా వ్యత్యాసం ఉంటుంది. అవి సాధారణ రంగులతో పాటు అతీనీలలోహిత కాంతిని కూడా స్పష్టంగా చూడగలవు. మనకు కేవలం ఒకే రంగులో కనిపించే పువ్వులు, తేనెటీగలకు ప్రత్యేకమైన డిజైన్లతో కనిపిస్తాయి. UV కాంతి వల్ల పువ్వు మధ్యభాగంలో మకరందం ఎక్కడ ఉందో చూపించే మెరిసే గుర్తులు వాటికి కనిపిస్తాయి. దీనివల్ల అవి సమయాన్ని వృథా చేయకుండా నేరుగా ఆహారాన్ని పసిగడతాయి.

5 / 5
క్రమశిక్షణకు నిలువుటద్దం: తేనెటీగల గూడు అనేది ఒక పరిపూర్ణమైన రాజ్యాంగం ఉన్న సామ్రాజ్యం లాంటిది. ఒక బలమైన, ఆరోగ్యకరమైన గూటిలో 50,000 నుండి 80,000 వరకు తేనెటీగలు నివసిస్తాయి. ఇందులో శ్రామిక ఈగలు, మగ ఈగలు ఉంటాయి. గూటి మొత్తానికి ఒకే ఒక్క రాణి తేనెటీగ ఉంటుంది. దీని ప్రధాన బాధ్యత సంతానోత్పత్తి. ఒక రాణి తేనెటీగ తన సంతానోత్పత్తి సమయంలో ప్రతిరోజూ దాదాపు 2,000 గుడ్లు వరకు పెడుతుంది. ఇది దాని సొంత శరీర బరువు కంటే కూడా ఎక్కువ కావడం విశేషం.

Loading...
Unable to load recommendations.
Follow Us