
స్మార్ట్‌ఫోన్‌ను ప్రతిరోజూ ఛార్జ్ చేయడం వల్ల మీ విద్యుత్ బిల్లు పెరుగుతుందా? చాలా మంది మనసులో మెదిలే ప్రశ్న ఇది.. కానీ సమాధానం చాలా మందికి తెలియదు. నిజానికి, ఫోన్‌ను ఛార్జ్ చేయడం వల్ల చాలా తక్కువ విద్యుత్ ఖర్చవుతుంది. మొబైల్ ఫోన్ ఛార్జ్ చేయడానికి ఏడాదికి ఎంత డబ్బు ఖర్చవుతుందో మీకు తెలుసా? ఈ నివేదికలో ఆ లెక్కలు తేలాయి మరీ..

సాధారణంగా ఫోన్ ఛార్జర్ శక్తి 5 నుంచి 20 వాట్ల మధ్య ఉంటుంది. ఒక సాధారణ ఛార్జర్ దాదాపు 5 వాట్స్. ఫాస్ట్ ఛార్జర్లు 18-20 వాట్స్ లేదా అంతకంటే ఎక్కువ ఉండవచ్చు. ఫోన్ పూర్తిగా ఛార్జ్ కావడానికి దాదాపు 1 నుంచి 2 గంటలు పడుతుంది. ఇది ఫోన్ మోడల్,ఛార్జర్‌పై ఆధారపడి ఉంటుంది.

మీరు 10-వాట్ ఛార్జర్‌తో ఫోన్‌ను 2 గంటల్లో ఛార్జ్ చేశారని అనుకుందాం. అప్పుడు విద్యుత్ వినియోగం = 10 వాట్స్ × 2 గంటలు = 20 వాట్స్ (వాట్-అవర్) = 0.02 యూనిట్లు. అంటే ఫోన్‌ను ఒకసారి ఛార్జ్ చేయడానికి కేవలం 0.02 యూనిట్ల విద్యుత్ మాత్రమే ఖర్చు అవుతుంది.

ఫోన్‌ను రోజుకు ఒకసారి ఛార్జ్ చేస్తే 0.02 యూనిట్ల విద్యుత్ ఖర్చవుతుంది. కాబట్టి వార్షిక వినియోగం 0.02 × 365 = సంవత్సరానికి సుమారు 7 నుంచి 10 యూనిట్ల విద్యుత్ ఖర్చు అవుతుంది. విద్యుత్ రేటు యూనిట్‌కు రూ.2.70 అయితే, సంవత్సరానికి ఛార్జింగ్ ఖర్చు రూ.958 వరకు ఉంటుంది. అయితే, ఈ ఖర్చు యూనిట్ ఖర్చుపై ఆధారపడి ఉంటుంది. ఆయా రాష్ట్రంలో ప్రస్తుత యూనిట్ విద్యుత్ రేటు ఆధారంగా ఫోన్‌ను ఛార్జ్ చేయడానికి ఎంత ఖర్చవుతుందో అంచనా వేయవచ్చు.

గుర్తుంచుకోండి.. మీ ఫోన్ ఛార్జింగ్‌లో ఉన్నప్పటికీ ఛార్జర్ ప్లగిన్ చేయబడినప్పటికీ, అది కొంత విద్యుత్‌ణు వినియోగిస్తుంది. ఇది మీ విద్యుత్ బిల్లు పెరగకుండా ఉండటానికి ఫోన్‌ను ఛార్జ్ చేసిన తర్వాత ఛార్జర్‌ను అన్‌ప్లగ్ చేయడం మర్చిపోకూడదు.