Old Phones: పనికిరావని పాత ఫోన్‌లను పడేస్తున్నారు.. ఆగండి.. వాటితో గూగుల్ ఏం చేస్తుందో తెలిస్తే..

Updated on: Jun 18, 2026 | 1:31 PM

మీ ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ వృథాగా పడి ఉందా? అయితే అది దేనికి పనికిరాదని అస్సలు అనుకోకండి.. ఎందుకంటే, మీ పాత ఫోన్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత అధునాతన కంప్యూటింగ్ వ్యవస్థలో భాగం కాబోతోంది. అవును ప్రముఖ సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ పాత స్మార్ట్‌ పోన్‌లో డేటా సెంటర్స్‌ను బిల్డ్‌ చేసే ప్రాజెక్ట్‌ను చేపట్టింది. ఇంతకూ ఈ ఫోన్లతో డేటా సెంటర్లను ఎలా తయారు చేస్తారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 6
నార్మల్‌గా మనకు డేటా సెంటర్స్‌ను రన్ చేయాలంటే.. ఎక్కవ మొత్తంలో వాటర్ సోర్స్ అవసరం ఉంటుంది. దానికి తోడు డేటా సెంటర్స్ కారనంగా పర్యావరణానికి కూడా హాని కలుగుతుంది. కాబట్టి పర్యావరణానికి ఎలాంటి డ్యామేజ్ కలగకుండా డేటా సెంటర్లను తయారు చేయాలని.. గూగుల్‌ అనుకుంది. ఇందులో భాగంగానే  పాత స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించి తక్కువ కార్బన్ ఉద్గారాలను విడుదల చేసే ఒక సరికొత్త డేటా సెంటర్‌ను నిర్మించే పనిలో పడింది.

2 / 6
మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, గూగుల్ పాత స్మార్ట్‌ఫోన్‌లలోని చిప్, మెమరీ, స్టోరేజ్‌ను ఉపయోగించి వేలాది పరికరాలను ఒకదానితో ఒకటి అనుసంధానం చేసి.. దాని నుండి ఒక మినీ డేటా సెంటర్‌ను సృష్టిస్తుంది. క్లౌడ్ అప్లికేషన్లు, పరిశోధన వర్క్‌లోడ్‌లను నిర్వహించడంలో ఈ ప్రక్రియ ఎంతగానో సహాయపడుతుందని గూగుల్‌ చెబుతోంది.

3 / 6
ఈ ప్రాజెక్ట్‌ను సక్సెస్ చేసేందుకు గూగుల్ ఒక ప్రముఖ అమెరికన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధన బృందంతో కలిసి పనిచేస్తుంది. పాత స్మార్ట్‌ఫోన్‌లను ఒక శక్తివంతమైన కంప్యూటింగ్ ప్లాట్‌ఫారమ్‌గా ఎలా మార్చవచ్చనే అంశంపై ఈ రెండు బృందాలు పరిశోధనలు చేస్తున్నాయి. ఈ ప్రయోగం పూర్తిగా విజయవంతమైతే, రాబోయే రోజుల్లో సుమారు 2,000 పాత గూగుల్ పిక్సెల్ ఫోన్‌లతో నడిచే ఒక పూర్తి స్థాయి డేటా సెంటర్‌ను మనకు అందుబాటులోకి వస్తుందని గూగుల్ చెబుతోంది..

4 / 6
ఫోన్ క్లస్టర్ కంప్యూటింగ్ అంటే ఏమిటి? ఇది ఎలా పనిచేస్తుంది? అనే విషయానికి వస్తే.. గూగుల్ ఈ ప్రాజెక్ట్‌కు 'ఫోన్ క్లస్టర్ కంప్యూటింగ్' అని పేరు పెట్టింది. అయితే మొదట స్మార్ట్‌ఫోన్ నుండి డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, బాడీ వంటి భాగాలను వేరు చేస్తారు. ఇవన్నీ తీసేసాక మిగిలే మదర్‌బోర్డులను ఒకదానికొకటి కనెక్ట్ చేస్తారు. ఈ కలిపిన బోర్డులలో 'లైనక్స్' ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఇన్‌స్టాల్ చేస్తారు. ఇలా ఏర్పడిన పెద్ద క్లస్టర్‌ను నిర్వహించడానికి అత్యంత అధునాతన క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్లాట్‌ఫారమ్ అయిన కుబెర్నెటెస్ ను ఉపయోగిస్తారు.ఇది అత్యంత అధునాతన క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌గా పనిచేస్తుంది.

5 / 6
గూగుల్ యొక్క అసలు ఉద్దేశ్యం ఏమిటి? కంప్యూటింగ్ రంగం ద్వారా వెలువడే కార్బన్ ఉద్గారాలు ప్రధానంగా రెండు విషయాలపై ఆధారపడి ఉంటాయి. మొదటిది, సిస్టమ్ ఆపరేషన్ సమయంలో ఉపయోగించే విద్యుత్ మరియు రెండవది, కొత్త హార్డ్‌వేర్ తయారీ సమయంలో కలిగే కాలుష్యం. పాత స్మార్ట్‌ఫోన్‌ల భాగాలను పునర్వినియోగించడం ద్వారా ఎలక్ట్రానిక్ వ్యర్థాలను తగ్గించడంతో పాటు, పర్యావరణంలో కార్బన్ పరిమాణాన్ని కూడా తగ్గించాలని గూగుల్ కోరుకుంటోంది. ప్రస్తుతం, పరిశోధన బృందం 2,000 స్మార్ట్‌ఫోన్‌ల క్లస్టర్‌ను సృష్టించడం ద్వారా సిస్టమ్ ప్రోగ్రామింగ్ మరియు అధునాతన కంప్యూటింగ్ రంగంలో ఒక కొత్త చరిత్రను సృష్టించే దిశగా ముందుకు సాగుతోంది.

6 / 6
గూగుల్ అసలు లక్ష్యం ఏమిటి?: కంప్యూటింగ్ రంగం వల్ల పర్యావరణానికి జరిగే కాలుష్యం ప్రధానంగా రెండు విషయాలపై ఆధారపడి ఉంటుంది, సిస్టమ్స్ రన్ అవుతున్నప్పుడు అవి వినియోగించే విద్యుత్. కొత్త హార్డ్‌వేర్ పరికరాలను తయారు చేసేటప్పుడు వెలువడే కాలుష్యం. పాత స్మార్ట్‌ఫోన్‌లను పునర్వినియోగించడం ద్వారా ఎలక్ట్రానిక్ వ్యర్థాలను తగ్గించడమే కాకుండా, కొత్త పరికరాల తయారీ వల్ల కలిగే కార్బన్ ఉద్గారాలను కూడా అదుపు చేయవచ్చని గూగుల్ భావిస్తోంది. ప్రస్తుతం, ఈ పరిశోధన బృందం 2,000 స్మార్ట్‌ఫోన్‌ల క్లస్టర్‌ను విజయవంతంగా రూపొందించి, అధునాతన కంప్యూటింగ్ రంగంలో ఒక కొత్త చరిత్రను సృష్టించే దిశగా అడుగులు వేస్తోంది.

Follow Us