
చాలామంది అలసట తగ్గించుకోవడానికి, శక్తిని పెంచుకునేందుకు బ్లాక్ కాఫీ తాగుతారు. కాఫీలోని కెఫైన్ నాడీ వ్యవస్థను ఉత్తేజిస్తుంది. అయితే, ఎక్కువగా తాగితే హృదయ స్పందన రేటు పెరుగుతుంది, అనవసర భయం, ఆందోళన, వణుకు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

అదేవిధంగా, బ్లాక్ కాఫీ తక్కువ ఆహారంతో తాగితే ఆమ్లత్వం కారణంగా గ్యాస్ట్రిక్ సమస్యలు, గుండెల్లో మంట కలగడం సాధ్యమే. కొందరికి ఇది విరేచనానికి కూడా దారితీస్తుంది.

శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుకోవడానికి కూడా నీళ్లు సహాయపడతాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ 2 నుంచి 3 లీటర్ల నీళ్లు ప్రతి రోజూ శరీరంలోకి వెళ్లాలి.

సాయంత్రం లేదా పడుకునే ముందు బ్లాక్ కాఫీ తాగడం నిద్రపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కెఫైన్ శరీరంలో చేరిన తర్వాత నిద్రకు సహాయపడే హార్మోన్ల పనితీరును బద్దలుచేస్తుంది.

అయితే, రోజుకు రెండు నుంచి మూడు కప్పుల కాఫీ తాగడం సాధారణంగా సమస్య కాదు అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కానీ, దీని కంటే ఎక్కువ తాగడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. (చిత్ర క్రెడిట్: గెట్టి ఇమేజెస్)