
మనలో చాలా మంది హోటల్ వాళ్లు చేసేలా గట్టి కొబ్బరి చట్నీని ఇష్టపడతారు. కానీ అలా చేయడం కష్టంగా ఉంటుంది. ఇక్కడ చెప్పినట్టుగా చేస్తే ఈ గట్టి కొబ్బరి చట్నీతో వేడి వేడి ఇడ్లీలు, క్రిస్పీ దోశెలను తింటే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. అంత రుచిగా వస్తుంది. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసి చూడండి.

గట్టి కొబ్బరి చట్నీకి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, 4 పచ్చిమిర్చి , రెండు టేబుల్ స్పూన్లు వేయించిన శెనగపప్పు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక చిన్న అల్లం ముక్క, ఇంకా రుచికి సరిపడా ఉప్పు, ఇంకా చింతపండు కొద్దిగా, అలాగే నీళ్లు కూడా తక్కువగా తీసుకోవాలి.

గట్టి కొబ్బరి చట్నీ తయారీ విధానం: ముందుగా పచ్చి కొబ్బరిని ముక్కలుగా కట్ చేసుకుని గిన్నెలో పెట్టుకోవాలి. కొబ్బరి మంచిగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఇక ఇప్పుడు మిక్సీ తీసుకుని దానిలో కప్పు కొబ్బరి ముక్కలు, ఇంకా వేయించిన శెనగపప్పును వేసుకోవాలి. ఈ శెనగపప్పు వేస్తె చట్నీ రుచి పెరుగుతుంది.

ఇంకా దీనిలో పచ్చిమిర్చి, అల్లం ముక్క, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా చింతపండు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. వీటిని వేస్తె చట్నీకి మంచి రుచి, సువాసన వస్తాయి. ఆ తరవాత దీనిలో నీళ్లు పోసి మెత్తగా పట్టుకోవాలి. గట్టి చట్నీ కాబట్టి నీళ్లు పోయకూడదు. అలా చేస్తే చట్నీ పలుచగా.. జోరుగా అయిపోతోంది.

కొబ్బరి ముక్కలు మెత్తగా లేకుండా బరకగా ఉండేలా చేసుకోవాలి. ఇలా చేస్తే హోటల్ స్టైల్ లాగా గట్టి కొబ్బరి చట్నీ ఉంటుంది ఈ చట్నీని ఒక చిన్న గిన్నెలోకి తీసుకుని దానిలో కొంచం తరిగిన కొత్తిమీర కూడా వేసి దీనిలో కలుపుకోవాలి. ఇంకా రుచి పెరగడం కోసం మీరు ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు.