
తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుంటూరు కూర కారం చాలా ఇష్టం ఉంటుంది. ఎందుకంటే? దీంతో ఎలాంటి రిసిపీలు చేసినా రుచి అదిరిపోతుంది. అందుకే చాలా మంది దీనిని ఇష్టపడతారు. కాగా ఇప్పుడు మనం గుంటూరు కూర కారం ఇంటిలోనే చాలా సింపుల్‌గా ఎలా చేయాలో మనం చూసేద్దాం.

కావాల్సిన పదార్థాలు : కారం (గుంటూరు మిర్చి, బ్యాడిగి మిర్చి కలిపి)500 గ్రాములు, ధనియాలు 100 గ్రాములు, జీలకర్ర: 50 గ్రాములు , శెనగపప్పు: 2 టీస్పూన్లు, మినపప్పు: 2 టీస్పూన్లు, మెంతులు: 2 టీస్పూన్లు, ఆవాలు: 2 టీస్పూన్లు, మిరియాలు: 1 టీస్పూన్, కరివేపాకు, కల్లుప్పు, పసుపు,వెల్లుల్లి రెబ్బలు, ఆముదం

తయారీలోకి వెళ్లితే.. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. తర్వాత ధనియాలనుజీలకర్ర, శనగపప్పు, మినపప్పు, వంటివి కూడా మంచిగా బంగారు రంగు వరకు వేయించుకోవాలి. తర్వాత మెంతులను కొద్దిగా వేగిన తర్వాత ఆవాలు, మిరియాలు కలిపి లో ఫ్లేమ్‌లో నెమ్మదిగా వేయించాలి. తర్వాత ఒక గుప్పెడు శుభ్రంగా కడిగి, తడి లేకుండా ఆరబెట్టిన కరివేపాకును కడాయిలో వేయాలి. అలాగే అరకప్పు కల్లు ఉప్పు, కరివేపాకు, ఇవన్నీ కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు వేయించిన మసాలా దినుసులు, కరివేపాకు, ఉప్పు మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత, కొద్దికొద్దిగా మిక్సీ జార్‌లో వేసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి. దీన్ని సంబారు అని అంటారు. కొత్తగా చేసేవారికి సులభంగా అర్థం కావడానికి, అరకిలో కారానికి రెండు కప్పుల సంబారు పొడి కరెక్ట్‌గా సరిపోతుంది.

దీని తర్వాత క వెడల్పాటి గిన్నెలో అరకిలో కారం, సిద్ధం చేసుకున్న సంబారు పొడి, 2 టీస్పూన్ల పసు 100 గ్రాముల వెల్లుల్లి రెబ్బలు వేయాలి. ఇవన్నీ బాగా కలిసేలా స్పూన్‌తో కలపాలి. అలాగే, ఇప్పుడు 50 గ్రాముల ఆముదం వేయాలి. వంటాముదం వేసిన తర్వాత, చేత్తో బాగా కలిపి, ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా మిక్సీ జార్‌లో వేసుకుని మరోసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కారం, మసాలా, వెల్లుల్లి అన్నీ ఒకేలా బాగా కలిసిపోతాయి. అంతే టేస్టీ టేస్టీ గుంటూరు కూర కారం రెడీ.