Uric Acid in Winter: శీతాకాలంలో యూరిక్‌ సమస్యతో ఇబ్బందిపడుతున్నారా? ఈ డ్రింక్స్‌ పరగడుపున తాగి చూడండి

|

Jan 15, 2025 | 8:59 PM

చలికాలం వచ్చిందంటే ఒంట్లో యూరిక్ యాసిడ్ నిల్వలు పెరిగిపోతాయ్. దీంతో రకరకాల ఆరోగ్య సమస్యలు చుట్టు ముడతాయి. ఈ సమస్యను నేచురల్ గా వదిలించుకోవాలంటే కొన్ని చక్కని చిట్కాలు చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా వంట గదిలో దొరికే పదార్ధాలతో చేసిన పానియాలు పరగడుపున తాగితే కొన్ని రోజుల్లో ఈ సమస్య నుంచి బయటపడొచ్చు..

1 / 5
యూరిక్ యాసిడ్ సమస్య చాలా మందిని వేధిస్తుంది. రక్తంలో ఇది పెరిగితే వివిధ ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఇటీవల కాలంలో ఈ సమస్య చాలా మందిలో రోజురోజుకు పెరుగుతోంది. ఫలితంగా కీళ్లలో నొప్పి కనిపిస్తుంది. అందుకే యూరిక్ యాసిడ్ నియంత్రణలో ఉంచుకోవడం అవసరం. దీన్ని నియంత్రించడానికి అనేక మార్గాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా కొన్ని రకాల పదార్ధాలతో చేసిన హెల్తీ డ్రింక్స్ ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటే ఈ సమస్య నుంచి సులువుగా బయటపడవచ్చు.

2 / 5
ఉదయం నిద్రలేచిన వెంటనే ఒక గ్లాసు గోరువెచ్చని నిమ్మరసం తాగడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇది శరీరంలో యూరిక్ యాసిడ్‌ను తగ్గిస్తుంది. యాసిడ్ ఏర్పడకుండా చేస్తుంది. ఇందులోని నీరు యూరిక్ యాసిడ్‌ని వదిలించుకోవడానికి సహాయపడుతుంది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కూడా ఉన్నాయి.

3 / 5
గూస్బెర్రీ రసం కూడా తాగవచ్చు. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి సహాయపడుతుంది. ఇది రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. శరీరంలో పెరిగిన యూరిక్ యాసిడ్‌ను నియంత్రిస్తుంది.

4 / 5
తులసి ఆకులను నీటిలో బాగా మరిగించి టీలా తాగవచ్చు. తులసి ఆకులు శరీరంలోని అదనపు యూరిక్ యాసిడ్‌ను తొలగించడంలో సహాయపడతాయి. అలాగే పచ్చి అల్లం ముక్కలను నీటిలో బాగా మరిగించి, వడగట్టి తాగడం వల్ల శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ను నియంత్రిస్తుంది. ఇది సహజంగా యూరిక్ యాసిడ్‌ను నియంత్రిస్తుంది.

5 / 5
రాత్రి పడుకునేటప్పుడు ఒక గ్లాసు నీళ్లలో కొన్ని మెంతి గింజలను వేసి రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే లేచి ఖాళీ కడుపుతో ఆ నీటిని తాగితే రక్తంలో చక్కెర స్థాయిలే కాకుండా యూరిక్ యాసిడ్ కూడా తగ్గుతుంది. లేదంటే ఒక కప్పు నీటిలో బార్లీ వేసి ఐదు నిమిషాలు మరిగించాలి. తర్వాత వడకట్టి తాగాలి. ఇది శరీరంలో యూరిక్ యాసిడ్ మొత్తాన్ని నియంత్రిస్తుంది. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగితే చక్కని ఫలితాలు పొందొచ్చు.