
జుట్టు ఒత్తుగా పెరగడానికి బయట ఖరీదైన క్రీమ్స్ కొనుగోలు చేసి వాడకుండా, ఇంటిలోనే సహజంగా దొరికే మందారంతో ఇలా పేస్ట్ తయారు చేసి హెయిర్ మాస్క్ గా ఉపయోగించడం వలన బోలెడు ప్రయోజనాలు ఉన్నాయంట. కాగా, హెయిర్ మాస్క్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాల్లోకి వెళ్లితే.. మందారం పువ్వులు, ఆకులు, కొబ్బరి నూనె వన్ టీస్పూన్, కలబంద గుజ్జు.

తయారీలోకి వెళ్లితే.. మందారంలో పువ్వుల్లో జుట్టు పెరుగుదలకు కావాల్సిన చాలా పోషకాలు ఉంటాయి. వీటిని జుట్టుకు ఉపయోగించడం చాలా మంచిది. అయితే ఈ హెయిర్ మాస్క్ తయారు చేయడానికి ముందుగా, మందార పువ్వులు లేదా ఆకులను తీసుకోవాలి. వాటిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. చీడ పీడ ఉన్నవి తీసుకోకపోవడం మంచిది. తర్వాత వీటిని పేస్ట్‌లా తయారు చేసుకోవాలి.

ఆ తర్వాత మందారం పువ్వు, ఆకుల పేస్ట్‌లో మనం పైన చెప్పిన కొబ్బరి నూనె, పెరుగు, కలబంద గుజ్జు అన్నింటినీ మంచిగా కలపాలి. వీటన్నింటినీ కలిపి మెత్తగా పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. దానిలో నీరు తక్కవగా పోయాలి. కొందరు నీళ్లలా చేస్తుంటారు కానీ అలా చేయకూడదు. గోరింటాకు ఎలా అయితే గ్రైండ్ చేసుకుంటారో, అదే విధంగా మందార పువ్వు పేస్ట్ తయారు చేసుకోవాలి.

తర్వాత దానిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిని జుట్టుకు ఆయిల్ లేకుండా చూసుకోవాలి. తర్వాత జుట్టును పూర్తిగా దువ్వుకోవాలి. అనంతరం చేతితో పేస్ట్ తీసుకొని మంచిగా జుట్టుకు పూర్తిగా పట్టే విధంగా అప్లై చేసుకోవాలి. దాదాపు 20 నిమిషాల వరకు దానిని అలాగే ఉంచి, తర్వాత క్లీన్ చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి లేదా రెండు సార్లు చేయడం వలన జుట్టు ఒత్తుగా పెరగడమే కాకుండా మిల మిలా మెరుస్తుంది.

అంతే కాకుండా ఇలా వారానికి ఒకసారి లేదా రెండు సార్లు మందారం ప్యాక్ జుట్టుకు పెట్టుకోవడం వలన, ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. అంతే కాకుండా హార్మోన్ల స్థితిని మెరుగు పరుస్తుంది. కుదుళ్లకు మంచి శక్తిని ఇస్తుంది. అయితే ఎవరైనా ఈ ప్యాక్ ఉపయోగించిన తర్వాత గాయలు, పుండులా అవుతే దీనిని ఉపయోగించకపోవడం మంచిది