Menorrhagia: ఆ సమయంలో అధిక రక్తస్రావంతో ఇబ్బంది పడుతున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోండి

|

May 14, 2024 | 1:21 PM

ఆడవారికి ఋతుచక్రం ప్రతి నెలా వస్తుందన్న సంగతి తెలిసిందే. ప్రతి ఒక్కరికీ ఒకేలా ఋతు రక్తస్రావం ఉండదు. భిన్నంగా ఉంటుంది. అయితే కొందరికి భారీగా రక్తస్రావం అవుతుంది. దీంతో నీరసించి, మంచానికే పరిమితం కావల్సి ఉంటుంది. పీరియడ్స్ (ఋతుచక్రం) సుమారు ఐదు రోజులు ఉండాలి. అయితే అధికంగా బ్లీడింగ్‌ అయ్యేవారికి మాత్రం పీరియడ్స్ ఏడు రోజుల పాటు కొనసాగుతుంది. ఫలితంగా ప్రతి గంటకు ప్యాడ్ మార్చాల్సి వస్తుంది. ఇలాంటి లక్షణాలు మీలో కూడా ఉంటే..

1 / 5
ఆడవారికి ఋతుచక్రం ప్రతి నెలా వస్తుందన్న సంగతి తెలిసిందే. ప్రతి ఒక్కరికీ ఒకేలా ఋతు రక్తస్రావం ఉండదు. భిన్నంగా ఉంటుంది. అయితే కొందరికి భారీగా రక్తస్రావం అవుతుంది. దీంతో నీరసించి, మంచానికే పరిమితం కావల్సి ఉంటుంది. పీరియడ్స్ (ఋతుచక్రం) సుమారు ఐదు రోజులు ఉండాలి. అయితే అధికంగా బ్లీడింగ్‌ అయ్యేవారికి మాత్రం పీరియడ్స్ ఏడు రోజుల పాటు కొనసాగుతుంది. ఫలితంగా  ప్రతి గంటకు ప్యాడ్ మార్చాల్సి వస్తుంది. ఇలాంటి లక్షణాలు మీలో కూడా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించండి. అలాగే పీరియడ్స్ ఆగిపోయిన కొన్ని రోజుల తర్వాత మళ్లీ ప్రారంభమైనా తీవ్రంగా పరిగణించాల్సిందే.

2 / 5
నిజానికి ఈ పరిస్థితి శరీరంలో అకస్మాత్తుగా అభివృద్ధి చెందదు. ఇలాంటి వారికి ఏదైనా శారీరక సమస్య ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. కాబట్టి మీలో రకమైన సమస్య ఉన్నట్లయితే, వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.

3 / 5
ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్ల అసమతుల్యత గర్భాశయం లేదా ఎండోమెట్రియం లోపలి పొరను ఏర్పరుస్తుంది. ఋతు చక్రంలో ఈ ఎండోమెట్రియం శరీరం నుంచి విడుదలవుతుంది. కొద్దిరోజుల్లో మళ్లీ కొత్త పొర ఏర్పడుతుంది. అయితే హార్మోన్ స్థాయిలలో మార్పు ఉంటే ఎండోమెట్రియం చిక్కగా మారుతుంది. ఫలితంగా భారీగా రక్తస్రావం అవుతుంది. అండాశయాలలో సమస్య ఉంటే గర్భాశయంలో ఫైబ్రాయిడ్లు లేదా పాలిప్స్ అభివృద్ధి చెందుతాయి. ఇది అధిక రక్తస్రావంకు దారితీస్తుంది.

4 / 5
కొన్నిసార్లు నాన్-హార్మోనల్ ఇంట్రాయూటెరైన్ దుష్ప్రభావం కారణంగా భారీ రక్తస్రావం అవుతుంది. అలాగే ప్రెగ్నెన్సీ సమయంలో బ్లీడింగ్ అయినా అనుమానించవల్సిందే. అధిక రక్తస్రావం రక్తహీనతకు దారి తీస్తుంది. కాబట్టి వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. అలాగే ఐరన్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి.

5 / 5
పీరియడ్స్‌ సమయంలో అధికంగా రక్త నష్టం అవడం వల్ల అలసట భావన కలుగుతుంది. దీంతో రోజువారి పనులు కూడా చేసుకోలేక ఇబ్బంది పడతారు. అలాంటప్పుడు తగినంత విశ్రాంతి తీసుకోవాలి. కొన్ని రోజులు వ్యాయామం చేయడం కూడా మానేయాలి. ఎక్కువగా రక్తస్రావం కణాలకు తగినంత ఆక్సిజన్ అందక.. శ్వాస ఆడకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి వైద్యులను సంప్రదించడానికి ఏమాత్రం ఆలస్యం చేయకండి.